Tamil Nadu: ఇక నుంచి పెళ్లిల్లలో కూడా మద్యం సరఫరా చేయొచ్చు.. ప్రత్యేక లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం, వాణిజ్య స్థలాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, క్రీడా మైదానాలు మొదలైన ప్రదేశాల్లో మద్యం సరఫరాకు ఛార్జీలు ఇలా ఉన్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,00,000 రూపాయలు, మునిసిపాలిటీ పరిధిలో 75,000 రూపాయలు, మున్సిపాలిటీ సమీప ప్రాంతాలకు 50,000 రూపాయలు

Tamil Nadu: ఇక నుంచి పెళ్లిల్లలో కూడా మద్యం సరఫరా చేయొచ్చు.. ప్రత్యేక లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం

special license to serve liquor

Tamil Nadu: తమిళనాడు ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఒక ప్రత్యేక పాలసీ ద్వారా ఇక నుంచి కన్వెన్షన్ సెంటర్లు, కాన్ఫరెన్స్ హాల్స్, బంక్వీట్, మ్యారేజ్ హాల్స్, స్పోర్ట్స్ స్టేడియంలలో మద్యం సరఫరా చేయొచ్చు. తమిళనాడు లిక్కర్ పాలసీ-1981 కి తాజాగా స్టాలిన్ ప్రభుత్వం సవరణ చేసి ప్రత్యేక లిక్కర్ పాలసీ తీసుకువచ్చింది. అతిథులు, సందర్శకులు, అంతర్జాతీయ, జాతీయ శిఖరాగ్ర సమావేశాలతో పాటు ఈవెంట్‌లు, సమావేశాలు, వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేవారికి మద్యం అందించడం ఇక నుంచి మరింత సులువు అవుతుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

Maharashtra Politics: జోలె పట్టుకుని వెళ్తారు, జనాల చేతిలో చిప్ప పెడతారు.. మోదీపై ఉద్ధవ్ థాకరే ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం, వాణిజ్య స్థలాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, క్రీడా మైదానాలు మొదలైన ప్రదేశాల్లో మద్యం సరఫరాకు ఛార్జీలు ఇలా ఉన్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,00,000 రూపాయలు, మునిసిపాలిటీ పరిధిలో 75,000 రూపాయలు, మున్సిపాలిటీ సమీప ప్రాంతాలకు 50,000 రూపాయలు. ఇవి ఏడాదికి చెల్లించాల్సిన ఛార్జీలు. అదేవిధంగా, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతాల్లో రోజుకు 11,000 రూపాయలు, మునిసిపాలిటీ పరిధిలో 7,500 రూపాయలు, ఇతర ప్రదేశాలకు 5,000 రూపాయలు చెల్లించి లైసెన్స్‌లు పొందవచ్చు.

Puvvada Ajay Kumar: ఎవరెవరో వచ్చి కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు.. షర్మిల కడప రౌడీయిజం ఇక్కడ చూపిస్తుంది

ప్రత్యేక లైసెన్సు పొందేందుకు కార్పొరేషన్లలోని పోలీసు కమిషనర్, జిల్లాల్లోని పోలీసు సూపరింటెండెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం అని ప్రభుత్వ నోటీసులో పేర్కొన్నారు. “లైసెన్సీ తన సామాగ్రిని సంఘటనల స్థలానికి సమీపంలోని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ హోల్‌సేల్ డిపో నుంచి లేదా డిప్యూటీ కమిషనర్/అసిస్టెంట్ కమీషనర్ (ఎక్సైజ్) నియమించే లేదా ఆమోదించే ఇతర మూలాల నుంచి పొందాలి. డిప్యూటీ కమీషనర్/సహాయక కమిషనర్ (ఎక్సైజ్) ఆమోదించిన సామాగ్రి పరిమాణం ప్రకారం నిర్దేశించారు” అని నోటీసులో పేర్కొన్నారు. ప్రత్యేక లైసెన్స్ కోసం ఈవెంట్‌కు వారం ముందు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.