ఈవీఎం దొంగతో చర్చలు జరపం : చంద్రబాబుకి ఈసీ షాక్

ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని పోరుబాటపట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

  • Published By: veegamteam ,Published On : April 14, 2019 / 04:00 AM IST
ఈవీఎం దొంగతో చర్చలు జరపం : చంద్రబాబుకి ఈసీ షాక్

Updated On : April 14, 2019 / 4:00 AM IST

ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని పోరుబాటపట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

ఈవీఎంలలో అవకతవకలు జరుగుతున్నాయని పోరుబాటపట్టిన ఏపీ సీఎం చంద్రబాబుకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. చంద్రబాబు బృందంలో ఈవీఎం  దొంగ ఉన్నాడని సంచలన ఆరోపణలు చేసింది. ఈవీఎం దొంగతో మేము చర్చలు జరపము అని ఈసీ తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. చంద్రబాబుకి ఘాటుగా లేఖ రాసింది. ఇప్పుడీ లేఖ  రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.

ఏపీలో ఎన్నికల నిర్వహణలో ఈసీ పూర్తిగా విఫలమైందని, విశ్వసనీయత కోల్పోయిందని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 20మంది  బృందంతో చంద్రబాబు ఈసీని కలిశారు. 18 అంశాల మీద కంప్లయింట్ చేశారు. అందులో ఈవీఎంల మొరాయింపు ముఖ్యమైంది. చంద్రబాబు ఫిర్యాదులపై వివరణ ఇచ్చేందుకు ఈసీ రెడీ అయ్యింది. ఈవీఎంలపై  అనుమానాల నివృత్తికి భేటీ ఏర్పాటు చేసింది. ఈవీఎంలపై టీడీపీకి ఉన్న అభ్యంతరాలను తెలిపాలని చెప్పింది. టీడీపీ నుంచి టెక్నికల్ నిపుణులను పంపాల్సిందిగా సూచించింది.

దీని ఓకే చెప్పిన చంద్రబాబు.. ఈసీతో భేటీకి టీడీపీ తరఫున ఏపీ టెక్నికల్ సలహాదారు హరిప్రసాద్ (సాంకేతిక నిపుణుడు) ని పంపారు. హరిప్రసాద్ హాజరవడంపై ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ ను  ఈవీఎం దొంగగా అభివర్ణించింది. అలాంటి వ్యక్తితో తాము చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ‌కు ఈసీ రాసింది. అందులో  సంచలన ఆరోపణలు చేసింది.

‘టీడీపీ తరఫున హరిప్రసాద్ అనే సాంకేతిక నిపుణుడిని పంపారు. ఆయనపై 2010లో ఈవీఎం మెషిన్‌ దొంగతనం ఆరోపణలు ఉన్నాయి. 2010 మార్చి 13న ముంబైలోని ఎంఆర్‌ఏ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు  కూడా నమోదైంది. ఆ కేసు విచారణ ఏమైనప్పటికీ, ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని పరిగణనలోకి తీసుకోవడం సముచితం కాదు. దీనికి సంబంధించి గూగుల్‌లో వచ్చిన కథనం, ఆ ఫొటోను కూడా ఈ లేఖకు  జతచేస్తున్నాం. అలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంలో సభ్యులుగా చేర్చడం సముచితమా? అని ప్రశ్నించింది. హరిప్రసాద్ స్థానంలో వేరే వ్యక్తిని పంపండి’ అంటూ లేఖ రాసింది.

హరిప్రసాద్ గతంలో బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగిగా పని చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని 2010లో ప్రూవ్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది కాబట్టే టీడీపీ ఓడిపోయిందని తెలిపారు. ఆ సమయంలో  హరిప్రసాద్ పై కేసు నమోదైంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ప్రూవ్ చేయడానికి ఈవీఎం ఎక్కడి నుంచి వచ్చిందని ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఎక్కడి నుంచి దొంగిలించి ఇది ప్రూవ్ చేశారన్నది హాట్  టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆ పాయింట్ ను బేస్ చేసుకుని ఈసీ.. చంద్రబాబుకి ఘాటు లేఖ రాసింది.

హరిప్రసాద్ ను పంపడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని టీడీపీ తప్పుపట్టింది. హరిప్రసాద్ పై కేసులు ఉంటే మీకొచ్చిన సమస్య ఏంటి అని టీడీపీ నేతలు ఈసీని క్వశ్చన్ చేశారు. ఈవీఎంల వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేందుకే ఈసీ ఇలా చేస్తోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. హరిప్రసాద్ ను భేటీకి అనుమతించాలని టీడీపీ నేతలు ఈసీని కోరారు.