Etela Rajender : ఏం చెబుతారు.. సొంత నియోజకవర్గంలో ఈటల పర్యటన

మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు(జూన్ 8,2021) కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో పర్యటించనున్నారు. కమలాపూర్ మండల కేంద్రంలోని శంభునిపల్లి గ్రామం నుండి రోడ్ షో ద్వారా కమలాపూర్ చేరుకుంటారు.

Etela Rajender : మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు(జూన్ 8,2021) కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో పర్యటించనున్నారు. కమలాపూర్ మండల కేంద్రంలోని శంభునిపల్లి గ్రామం నుండి రోడ్ షో ద్వారా కమలాపూర్ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి వచ్చాక మొదటిసారి హుజూరాబాద్ వెళ్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ముందు.. ఈ పర్యటనతో కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేయనున్నారు ఈటల. హుజూరాబాద్ టూర్ సందర్భంగా మూడు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించనున్నారు ఈటల. కమలాపూర్‌, శంభునిపల్లి, కానిపర్తి గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించి అనంతరం మూడు గ్రామాల ప్రజలతో చర్చించే అవకాశం ఉంది.

టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈటల.. ఈ నెల 13న బీజేపీలో చేరనున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులతో చర్చలు జరిపి వారి సలహాలు, అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. స్పీకర్ సమక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే హోదాలో ఈటల రాజేందర్ కు తన సొంత మండలంలో ఇది చివరి పర్యటన కానుంది. ఈటల రాజేందర్ ను కలవడానికి మండల కేంద్రంలో మద్దతుదారుల ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రోడ్ షో చేయాలని కార్యకర్తలకు ఈటల సూచించారు. కాగా, ఈ టూర్ లో చివరిసారిగా తన మండల ప్రజలకు ఈటల ఏం చెబుతారు అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిగా మారింది.

ఈటల రాజీనామాతో ఆయన ప్రాతినిధ్యం వహించే హుజూరాబాద్ అసెంబ్లీకి త్వరలోనే ఉపఎన్నిక జరిగే చాన్సుంది. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. 6 నెలల్లో ఎప్పుడైనా హుజరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగొచ్చు. భూకబ్జా ఆరోపణలు రావడంతో ఈటలను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌‌ చేశారు. ఆ తర్వాత ఆయన టీఆర్‌‌ఎస్‌‌ సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగే ఆలోచనలో ఈటల ఉన్నారని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు