జగన్ పాలనకు జేసీ 100 మార్కులు

  • Publish Date - September 6, 2019 / 02:21 PM IST

ఏపీ సీఎం గా జగన్ పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యింది.  వైసీపీ నేతలు జగవ్ ప్రశంసలు  కురిపిస్తుంటే,. విపక్ష టీడీపీ నేతలు విమర్శలుచేస్తున్నారు, కానీ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివారకర రెడ్డి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు,. జగన్ 100 రోజుల పాలనకు 100 మార్కులు వెయ్యాలని అవసరమమైతే 110 మార్కులూ  వేయాలని అన్నారు.  జగన్ విపక్షం లో ఉన్నా సీఎంగా ఉన్నా మావాడే అని  జెసి అన్నారు. జగన్ పాలన లో కిందా మీదా  పడుతున్నాడు…జగన్ కు చేయి పట్టి నడిపించేవారు  కావాలని జేసీ అన్నారు. జగన్ పాలన లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు  జేసి చెప్పారు.

 ‘మావాడు చాలా తెలివైనవాడు’  ఎంతో కష్టపడి ఎంతో‌ అలోచన చేసి మేధావులు అందరితో మాట్లాడి చేసిన పనులన్నిటిని ఒక వ్యాఖ్య తో కొట్టి పడేయలేమని… ఆయన ఏదో మంచి ఆలోచనతో పది మందికి ఉపయోగపడాలనే ఆలోచనతో‌ చేస్తున్నారు… అవి సక్రమం గా ఆయన ఆశించిన రీతిలో జరుగుతాయా జరగవా? లేక  వికటిస్తాయా అనేది కొంత సమయం  వేచి చూడాలి అని అన్నారు. ప్రతి అంశాన్ని మైక్రోస్కోపులో చూసి లోపాలను సరిదిద్దాలి.. అంతేగాని నేలకేసి కొట్టొద్దన్నారు.  రాజధాని తరలింపు విషయమై మాట్లాడుతూ ..రాజధాని ఇక్కడే ఉంటుంది.. ఎక్కడికీ తరలిపోదనే అభిప్రాయాన్ని జేసీ వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ అడిగితే సలహాలు ఇస్తానన్నారు.

జగన్ ప్రభుత్వం ఆర్టీసిని విలీనం చేయటం పై మాట్లాడుతూ…అధికారంలోకి వచ్చాక కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేదని.. అలాంటప్పుడు ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమే అన్నారు జేసీ. ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగుల విలీనం భారం అవుతుందని.. ఏ ప్రభుత్వం కూడా వ్యాపారం చేయకూడదన్నారు. అధికారం చెలాయించాలి.. సమన్వయం చేయాలి.. ప్రైవేట్‌ వాళ్లకు ఇచ్చి అదుపులో పెట్టి నడిపించాలన్నారు. ఉద్యోగుల్ని విలీనం చేయడం వ్యాపారం చేయడమనే అభిప్రాయాన్ని జేసీ దివాకర రెడ్డి వ్యక్తం చేశారు.