ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది జనసేనాని
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేది జనసేనాని తేల్చుకోలేకపోతున్నారు. రోజుకో అసెంబ్లీ సెగ్మెంట్ పేరు తెరపైకి వస్తోంది. ముందు ఏలూరు నుంచి పవన్ పోటీ చేస్తారని అన్నారు. ఇప్పుడు గాజువాక, పిఠాపురం పేర్లు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం గాజువాక(విశాఖ జిల్లా), పిఠాపురం(తూర్పుగోదావరి జిల్లా)లో లక్షకు పైగా జనసేన సభ్యత్వాలు నమోదు కావడమే. దీనికి తోడు గాజువాక, పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. దీంతో ఆ నియోజకవర్గాల వైపు పవన్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Read Also : మంగళగిరిలో నోట్లకట్టల కలకలం : కారులో రూ.80 లక్షలు
పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది పార్టీ వర్గాల్లోనే కాదు రాజకీయవర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది. ముందు అనంతపురం అన్నారు, తర్వాత ఇచ్చాపురం, కాకినాడ, పిఠాపురం, గాజువాక అన్నారు. ఇలా రోజుకో అసెంబ్లీ సెగ్మెంట్ పేరు తెరపైకి వచ్చింది. పులివెందుల అంటే జగన్, కుప్పం అంటే చంద్రబాబు అని వారి అసెంబ్లీ నియోజకవర్గాలు స్థిరపడ్డాయి. అలాగే పవన్ అంటే ఎక్కడ.. అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ప్రధానంగా గాజువాక, పిఠాపురం నియోజకవర్గాల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే విశాఖ జిల్లా గాజువాకలో లక్షకుపైగా జనసేన సభ్యత్వాలు నమోదయ్యాయి. పైగా కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం స్థానాన్ని కూడా పవన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. జనసేన సభ్యత్వాల నమోదు విషయంలో పిఠాపురం రెండో స్థానంలో ఉంది. దీనికి తోడు కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. తన బలం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్నట్టు పవన్ భావిస్తున్నారు. పిఠాపురం ప్రజాపోరాట సభలో… పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఉందని పవన్ అన్న విషయం తెలిసిందే. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న పవన్.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒకదాన్ని నుంచి కన్ఫామ్ గా పోటీ చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
Read Also : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు : టీఆర్ఎస్ 4, ఎంఐఎం 1