Ghulam Nabi Azad political party: తన కొత్త పార్టీ పేరు ప్రకటించి జెండా చూపిన గులాం నబీ ఆజాద్

కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇవాళ జమ్మూలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన మద్దతుదారులతో కలిసి మాట్లాడుతూ... ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ జెండాను కూడా చూపించారు. తమ పార్టీ జెండాలోని నీలిరంగు స్వేచ్ఛకు, తెలుపు రంగు శాంతికి, లేత పసుపు రంగు సృజనాత్మకత, ఐకమత్యం, వైవిధ్యానికి చిహ్నాలని ఆయన చెప్పారు.

Ghulam Nabi Azad political party: తన కొత్త పార్టీ పేరు ప్రకటించి జెండా చూపిన గులాం నబీ ఆజాద్

Ghulam Nabi Azad

Updated On : September 26, 2022 / 1:04 PM IST

Ghulam Nabi Azad political party: కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ ఇవాళ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇవాళ జమ్మూలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన మద్దతుదారులతో కలిసి మాట్లాడుతూ… ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ జెండాను కూడా చూపించారు. తమ పార్టీ జెండాలోని నీలిరంగు స్వేచ్ఛకు, తెలుపు రంగు శాంతికి, లేత పసుపు రంగు సృజనాత్మకత, ఐకమత్యం, వైవిధ్యానికి చిహ్నాలని ఆయన చెప్పారు.

కాగా, నెల రోజుల క్రితం గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇవాళ మీడియా సమావేశం నిర్వహిస్తానని నిన్న గులాం నబీ ఆజాద్ చెప్పారు. దీంతో ఇవాళ కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. చివరకు అదే నిజమైంది. జమ్మూకశ్మీర్ ప్రజల అభీష్టానికి అనుగుణంగానే తన పార్టీ పేరు ఉంటుందని ఆజాద్ అన్నారు.

తన పార్టీకి ఓ హిందుస్థానీ పేరు పెడతానని, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా ఆ పేరు ఉంటుందని చెప్పారు. తమ పార్టీ ద్వారా జమ్మూకశ్మీర్ కి మళ్ళీ పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జమ్మూకశ్మీర్ లో తన పార్టీ మొదటి యూనిట్ ను నెలకొల్పుతానని ఇప్పటికే ఆయన చెప్పారు.

COVID-19: దేశంలో కొత్తగా 4,129 మందికి కరోనా.. 43,415 యాక్టివ్ కేసులు