జనసేనకు 20 సీట్లు రావొచ్చు : పవన్ కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారు
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. మే 23న ఫలితాలు వెలువడతాయి. ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. మే 23న ఫలితాలు వెలువడతాయి. ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది
ఏపీలో ఎన్నికలు ముగిశాయి. మే 23న ఫలితాలు వెలువడతాయి. ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది. గెలుపు మాదే అని ఇటు టీడీపీ, అటు వైసీపీ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. 100కి పైగా సీట్లు మాకు వస్తాయని ఇరు పార్టీలూ చెప్పుకుంటున్నాయి. సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాలో ఉన్నాయి. ఏపీకి కాబోయే సీఎం.. అయితే చంద్రబాబు లేదంటే జగన్.. అని నాయకులే కాదు జనాలు కూడా ఫిక్స్ అయ్యారు. ఆ ఇద్దరు తప్ప మరొకరు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదనే వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలో సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చకు దారితీశాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయి, జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి, పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే అంశాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితుల ప్రభావంతో పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలను శాసించే అవకాశాలు ఉన్నాయని హరిరామ జోగయ్య అన్నారు. పవన్ కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని జోస్యం చెప్పారు. జనసేన పార్టీకి ఈ ఎన్నికల్లో 20 స్థానాల వరకు రావొచ్చన్నారు. దాంతో పవన్ సీఎం అన్నా కావాలి, లేకపోతే సీఎంను నిర్ణయించే కింగ్ మేకర్ అన్నా కావాలి అని హరిరామజోగయ్య అన్నారు. పవన్ సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే రీతిలో చెప్పారు.
పోలింగ్ ట్రెండ్ చూస్తుంటే టీడీపీ, వైసీపీలలో ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీకి కానీ వైసీపీకి కానీ 90 సీట్లు రావడం కష్టమే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే పవన్ కీలకంగా మారతారని హరిరామజోగయ్య అభిప్రాయపడ్డారు. పాలకొల్లులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరి హరిరామజోగయ్య విశ్లేషణ ఎంతవరకు నిజం అవుతుంది అనేది తెలియాలంటే మే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.