Maharashtra: గవర్నర్ పదవి నుంచి కోశ్యారి దిగిపోవడాన్ని విజయంగా ప్రకటించిన శివసేన
బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్లో కోశ్యారి సీనియర్ నేత. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈయన పదవీ కాలంలో అతిపెద్ద కాంట్రవర్సీ. ఇక ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ఉద్ధవ్‌ను సెక్యూలర్ ఎప్పుడు అయ్యావంటూ’ లేఖ రాయడం రాజకీయ విమర్శలకు దారి తీసింది

He insulted Shivaji Maharaj, Savitribai Phule: Aaditya on Koshyari
Maharashtra: మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటానని కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన భగత్‌సింగ్ కోశ్యారీ.. తాజాగా అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా, ఆమె ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ పరిణామంపై శివసేన (ఉద్ధవ్ వర్గం) హర్షం వ్యక్తం చేసింది. 2019 నుంచి మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. అనేక రాజకీయ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. ఛత్రపతి శివాజి, సావిత్రిబాయి, బాబాసాహేబ్ అంబేద్కర్ వంటి వారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. కాగా, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పదవి నుంచి తొలగిపోవడాన్ని శివసేన విజయంగా చెప్పుకుంటోంది.
Indian Constitution: అంత దమ్ము మనకు భారత రాజ్యాంగమే ఇచ్చింది.. సీజేఐ చంద్రచూడ్
“మహారాష్ట్ర వ్యతిరేకి అయిన గవర్నర్ రాజీనామా ఎట్టకేలకు ఆమోదించబడింది. అతను నిరంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను సావిత్రీబాయి ఫూలేను అవమానించారు. గవర్నర్‌ను భర్తరఫ్ చేయాలని శివసేన డిమాండ్ చేసింది. మా డిమాండ్ నెరవేరింది. ఇది చాలా పెద్ద విజయం. మహారాష్ట్ర వ్యతిరేకులకు గౌరవమర్యాదలు ఇవ్వడాన్ని శివసేన సహించదు” అని మాజీ మంత్రి, శివసేన (ఉద్ధవ్ వర్గం) కీలక నేత ఆదిత్య థాకరే అన్నారు.
Delhi-Mumbai Expressway: అమెరికా గొప్పతనం వెనుక ఉన్న సీక్రెట్ వెల్లడించిన నితిన్ గడ్కరీ
బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్లో కోశ్యారి సీనియర్ నేత. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈయన పదవీ కాలంలో అతిపెద్ద కాంట్రవర్సీ. ఇక ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ఉద్ధవ్‌ను సెక్యూలర్ ఎప్పుడు అయ్యావంటూ’ లేఖ రాయడం రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఏక్నాథ్ షిండే పడగొట్టినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గవర్నర్ పాత్ర ఉందంటూ మహా వికాస్ అఘాడి ప్రశ్నించింది. ఇక గత నవంబరులో రాజ్యాం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలను ఐకాన్‌లని చెప్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ‘పాత ఐకాన్’ అని వ్యాఖ్యానించడం కూడా మహా రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని లేపింది. ఇక ఈ స్థానంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.