హైపవర్ కమిటీ భేటీ : జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం

అమరావతిలో హైపవర్ కమిటీ మూడో సమావేశం అయింది. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై ఇవాళ మరోసారి చర్చిస్తున్నారు.

  • Published By: veegamteam ,Published On : January 13, 2020 / 06:01 AM IST
హైపవర్ కమిటీ భేటీ : జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం

Updated On : January 13, 2020 / 6:01 AM IST

అమరావతిలో హైపవర్ కమిటీ మూడో సమావేశం అయింది. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై ఇవాళ మరోసారి చర్చిస్తున్నారు.

అమరావతిలో హైపవర్ కమిటీ మూడో సమావేశం అయింది. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై ఇవాళ మరోసారి చర్చిస్తున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టిగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తోంది. మంత్రలు, ఐఏఎస్, ఐపీఎస్ లతో ఏర్పాటైన హైపవర్ కమిటీ ఇప్పటికే పలు సూచనలు చేసింది. రెండుసార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ మరోసారి సమావేశం అయింది. 

(జనవరి 17, 2020) వ తేదీనే ప్రభుత్వానికి హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. రైతులు, ఉద్యోగులతోపాటు భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. గత సమావేశాల్లో పరిపాలనే కాదు అభివృద్ధి వీకేంద్రకరణ ఎలా జరగాలన్న అంశంపై హైపవర్ కమిటీ దృష్టి పెట్టింది. బీసీజీ, జీఎన్ రావు కమిటీల నివేదికలే కాకుండా అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చించింది. కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కమిటీ భావించింది. దానికి సంబంధించి ప్రభుత్వం ముందు పలు ప్రతిపాదనలు పెట్టింది. ఉద్యోగుల తరలింపుపై పలు సూచనలు చేసింది.

ఇప్పటివరకు జరిగిన రెండు సమావేశాల్లో రాజధాని రైతుల మీదే ఎక్కువగా ఫోకస్ చేసినా ఈ సారి మాత్రం ఉద్యోగులు, వారి సాదకబాదకాలపై దృష్టి పెట్టారు. రైతులు, ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకొని, వాటిపై చర్చించిన అనంతరం జనవరి 17వ తేదీన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అంశంపై హైపవర్ కమిటీ దృష్టి పెట్టింది. ఆ మరుసటి రోజు జనవరి 18 వ తేదీ జరుగనున్న కేబినెట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికపై చర్చ జరుగనుంది.

దీంతో కమిటీ సభ్యులు అన్ని విషయాలపై ఫోకస్ చేస్తున్నారు.18న జరిగే కేబినెట్ సమావేశంలో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోద ముద్ర వేయడంతోపాటు జనవరి 20న ఏపీ అసెంబ్లీని సమావేశ పరచడం ద్వారా తీర్మానం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.