అనంతపురం : ’మీకు తగిలిన ప్రతీ గాయం..నా గుండెకు తగిలింది…అధికారంలోకి వచ్చాక మీ అందరినీ నేను ఆదుకుంటాను’ అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అనంతపురంలో సమర శంఖారావ సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. తాము అధికారానికొస్తే అక్రమంగా పెట్టిన దొంగ కేసులన్నింటినీ ఉపసంహరిస్తామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే కుల, మతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు.
వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి పేర్లను ఓటర్ లిస్టులోంచి తొలగిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు.. చెప్పని అబద్ధం ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వేయని డ్రామా ఉండదు… చూపని సినిమా ఉండదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనం పోరాటం చేస్తున్నది ఒక్క చంద్రబాబుతోనే కాదని… ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియాతోనూ అంటూ చెప్పుకొచ్చారు జగన్.