కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు : చంద్రబాబు

  • Publish Date - February 19, 2019 / 08:28 AM IST

అమరావతి: హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్న నేతలను వైసీపీలో చేరాలని బెదిరిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పదవులపై ఆశలు ఉన్న ఒకరిద్దరికి తప్పుడు సర్వేలు చూపి మభ్య పెడుతున్నారని  అలా పోయే వారిని పట్టించుకోవద్దని నేతలకు తెలిపారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షమే అని ఆయన తేల్చిచెప్పారు. 

పింఛన్ల పెంపు, పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని  చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. మంగళ, బుధ,గురువారాలు అన్నదాత సుఖీభవ వేడుకలు నిర్వహించాలని నేతలను సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాలతో జగన్‌కు ఫ్రస్టేషన్ పెరిగిందని విమర్శించారు.  హైదరాబాద్‌లో కూర్చుని కేసీఆర్‌తో కలిసి జగన్‌ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరంపై కేసులు వేసిన వాళ్లతో వైసీపీ లాలూచీ పడిందన్నారు. మూడు పార్టీల కుట్రలు నెరవేరితే రాష్ట్రానికి నీళ్లు రావని సీఎం చంద్రబాబు అన్నారు.
 

Read Also : జగన్ ను సీఎం చేయడానికే పార్టీలోకి వచ్చా : కిల్లి కృపారాణి

Read Also : మోడీ మీటింగ్ కు మా క్యాంపస్ ఇవ్వం : ఆంధ్రా వర్శిటీ