Kerala Politics: చీటింగ్ కేసులో అరెస్టైన కాంగ్రెస్ చీఫ్.. కాసేపటికి బెయిల్‌పై విడుదల
మావుంకల్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. కానీ, పోలీసులు తనపై నమోదు చేసిన కేసులతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇదిలావుండగా, కేరళలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకరన్ అరెస్టుపై మండిపడ్డారు. ఇది రాజకీయ కుట్రగా వారు అభివర్ణించారు

KPCC Chief: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) చీఫ్ కే.సుధాకరన్‌ను చీటింగ్ కేసులో అక్కడి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ విభాగం శుక్రవారం అరెస్టు చేసింది. అనంతరం కాసేపటికే బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు వివాదాస్పద పురాతన వస్తువుల వ్యాపారి మోన్సన్ మవున్‌కల్. బెయిల్‌పై విడుదలైన తర్వాత సుధాకరన్ మీడియాతో మాట్లాడుతూ.. క్రైమ్ బ్రాంచ్ అనేక గంటల ప్రశ్నల తర్వాత తనను అరెస్టు చేసిందని, దానికి ముందు విచారణ కోసం ఉదయం తాను హాజరయ్యానని చెప్పారు.
Bhatti Vikramarka Mallu : కాంగ్రెస్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ బై? భట్టి విక్రమార్క రియాక్షన్ ఇదే
“వారు నన్ను ప్రశ్నించారు. ఆ తర్వాత నన్ను అరెస్టు చేశారు. కొద్ది సమయానికి నాకు బెయిల్ వచ్చింది. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. నేను కోర్టులో ఈ కేసును ఎదుర్కొంటాను” అని ఆయన అన్నారు. తనకు శిక్ష పడేలా ఈ కేసులో తనపై ఎలాంటి సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద లేవని తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. “నాకు భయం లేదు. ఎక్కడా దాక్కోను” అని సుధాకరన్ అన్నాడు.
అయితే మావుంకల్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. కానీ, పోలీసులు తనపై నమోదు చేసిన కేసులతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇదిలావుండగా, కేరళలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధాకరన్ అరెస్టుపై మండిపడ్డారు. ఇది రాజకీయ కుట్రగా వారు అభివర్ణించారు. రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సతీశన్ మాట్లాడుతూ లెఫ్ట్ ప్రభుత్వం భయంతో పాలిస్తోందని విమర్శించారు. అందుకే ఇటువంటి వ్యూహాలతో ప్రతిపక్ష గొంతును నొక్కాలని ప్రయత్నిస్తున్నారని సతీషన్ మండిపడ్డారు.