చంద్రబాబు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు : ఎమ్మెల్యే రోజా
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారిందని విమర్శించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు బెల్ట్ షాపులను తొలగించలేకపోయారని ప్రశ్నించారు. సోమవారం (డిసెంబర్ 16, 2019) ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై చర్చ జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ మందుబాబులు ఆయన తమ్ముళ్లైనట్లు తమ్ముళ్లూ మందు రేట్లు పెరిగాయి కదా అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంత సిగ్గుమాలిన ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడైనా చూశారా అని అన్నారు. మద్యం ధరలు పెరిగాయని లబోదిబోమని ఏడుస్తున్నది చూస్తుంటే చంద్రబాబు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా అన్న అనుమానం కలుగుతుందన్నారు.
బుద్ధి ఉన్నవాళ్లు ఎవరైనా కురగాయలు, నిత్యవసరాల ధరలు పెరిగాయంటూ ఆందోళన చేయాలి కాని మద్యం రేట్లు పెరిగాయని అనడం అర్థం కాలేదన్నారు. మద్యం ధరలు పెరిగాయని ఇంతవరకు ఎవరైనా ఆందోళనలు చేశారా అని ప్రశ్నించారు. మద్యం ధరలు తగ్గించాలని ఎక్కడైనా మహిళా సంఘాలు ధర్నాలు చేశాయా అని అన్నారు. ఇసుక ధరలు పెరిగాయని ఇసుక దండలు వేసుకున్నారు… ఉల్లి పాయల రేట్లు పెరిగాయని అసెంబ్లీకి ఉల్లి దండులు వేసుకొచ్చారని.. మద్యం ధరలు పెరిగాయని మద్యం బాటిళ్లు మెడిలో వేసుకొస్తారేమోనని భయపడ్డానని…అలా రానందుకు సంతోషిస్తున్నానని చెప్పారు.
దశల వారి మద్యం పాన నిషేధానికి వ్యతిరేకమని టీడీపీ మహిళా విభాగంతో చంద్రబాబు తీర్మానం చేయించగలడా అని ప్రశ్నించారు. మద్యాన్ని ఏరులై ప్రవహింప చేయాలి, మద్యం నిషేధం వద్దని టీడీపీకి ఉన్న ఒక్కగానొక్క మహిళా ఎమ్మెల్యేతో తీర్మానం చేయించగలరా అని అన్నారు. చంద్రబాబుకు మద్యం అంటే ఎందుకంత మక్కువో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని, ఆయన పెట్టిన మద్యపాన నిషేదానికి వెన్నుపోటు పొడిచారని ఎద్దేవా చేశారు. అప్పుడు మామ ఎన్టీఆర్ కాబట్టి వెన్నుపోటు పొడిచారని..కానీ ఇక్కడున్నది జగన్ మోహన్ రెడ్డి..పులి అని అభివర్ణించారు.
అక్కడున్నది 151 మంది మేకలని..ఇక్కడున్నది 25 పులులని చంద్రబాబు టీవీలో చెబుతున్నారని చెప్పారు. పులిహోరా తింటే పులులు అయిపోరని…టీడీపీ పులిహోరా బ్యాచ్ అని విమర్శించారు. పులి అంటే జగన్ అని అన్నారు. ఎన్ని కష్టాలొచ్చినా..వారి ఛానళ్లో ఏ విధంగా బురద చల్లినా జగన్ మోహన్ రెడ్డి చిరు నవ్వుతో ఎదుర్కొన్నారని తెలిపారు. జగన్ తన నిజాయితీతో ప్రజల మనసు గెలుచుకొని ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నేరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న వారిని పులులు అంటారు..కానీ పులిహోరా బ్యాచ్ ను అనరని తెలుసుకోవాలన్నారు. మద్యపాన నిషేధానికి, మహిళా సంక్షేమానికి టీడీపీ వ్యతిరేకమని బాగా అర్థం అవుతుందన్నారు.
దిశ చట్టాన్ని ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ఆమోదించుకున్నాం..శాసన మండలిలో ఆమోదింపచేయాలని, తర్వాత గవర్నర్ ఆమోదించాలి…ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభించాక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే చట్టం అమలవుతుందన్న విషయం.. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఎందుకు తెలియదో అర్థం కావడం లేదన్నారు. ప్రజలను కన్య్ఫూజ్ చేయడానికి చంద్రబాబు దిగజారి పోతున్నాడని విమర్శించారు.
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాన్ని భరతమాత గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ కూడా చట్టాన్ని అభినందిస్తుందన్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఏపీ దిశ చట్టంపై ప్రశంసలు కురిపించిందన్నారు. దిశ చట్టాన్ని తెప్పించుకుని అమలు చేసుకోవాలని కేజ్రీవాల్ చెప్పారంటే.. చిన్నవాడైన జగన్.. ఢిల్లీ పెద్దలను కదిలించడం, ఆడపడచుల గురించి ఆలోచించడం చంద్రబాబుకు ఎందుకు అర్థం కాదో తెలియదన్నారు. దిశ చట్టాన్ని ప్రతి రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉందని..అమలు చేస్తారనే నమ్మకం ఉందన్నారు.