కల్యాణదుర్గం టీడీపీలో టికెట్ రచ్చ.. స్థానికులకే ఇవ్వాలని చంద్రబాబుకు డిమాండ్

కల్యాణదుర్గం టీడీపీ టికెట్ తనకే ఖరారైందని ప్రముఖ కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.

కల్యాణదుర్గం టీడీపీలో టికెట్ రచ్చ.. స్థానికులకే ఇవ్వాలని చంద్రబాబుకు డిమాండ్

Kalyandurg TDP Ticket Fight

Updated On : February 21, 2024 / 4:39 PM IST

Kalyandurg TDP Ticket Fight : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీలో గందరగోళం నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబుకు స్థానిక నేతలు అల్టిమేటం జారీ చేశారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. నిన్నటి దాకా.. కల్యాణదుర్గం టీడీపీ టికెట్ ను ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమా మహేశ్వర నాయుడు ఆశిస్తున్నారు. వీరిద్దరూ ఉప్పు నిప్పులా ఉన్నారు. ఇప్పుడు సడెన్ గా ఇరువురూ ఒకే వేదికపైకి వచ్చారు.

దీనికి కారణం.. కల్యాణదుర్గం టీడీపీ టికెట్ తనకే ఖరారైందని ప్రముఖ కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు ప్రచారం చేసుకోవడమే. దీంతో ఇరువురు నేతలు సమావేశం అయ్యారు. తమలో ఎవరో ఒకరికి మాత్రమే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికేతరులకు టికెట్ ఇవ్వకూడదని అల్టిమేటం జారీ చేశారు.

Also Read : పైకి పొత్తులు.. లోపల కత్తులు..? టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణం అదేనా?