Munugodu bypoll: మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక వేళ ఓటర్ల జాబితాపై వచ్చిన పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు విచారించింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా దీనిపై ఆదేశాలివ్వలేమని చెప్పింది. జాబితా ప్రకటించాక అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చని పేర్కొంది. ఓటర్ల జాబితాపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఓటర్ల నమోదుకు సంబంధించి హైకోర్టులో బీజేపీ రిట్‌ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జూలై 31 వరకు ఉన్న జాబితానే పరిగణించాలని, ఇందుకు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.

Munugodu bypoll: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక వేళ ఓటర్ల జాబితాపై వచ్చిన పిటిషన్‌ను ఇవాళ హైకోర్టు విచారించింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా దీనిపై ఆదేశాలివ్వలేమని చెప్పింది. జాబితా ప్రకటించాక అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చని పేర్కొంది. ఓటర్ల జాబితాపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఓటర్ల నమోదుకు సంబంధించి హైకోర్టులో బీజేపీ రిట్‌ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జూలై 31 వరకు ఉన్న జాబితానే పరిగణించాలని, ఇందుకు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.

తక్కువ సమయంలో కొత్తగా 25 వేల దరఖాస్తులు వచ్చాయని అభ్యంతరాలు తెలిపింది. మరోవైపు, ఓటర్ల జాబితా సవరణపై నివేదికను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి న్యాయస్థానానికి సమర్పించారు. మునుగోడులో 2018, అక్టోబరు 12 నాటికి 2,14,847 మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు. అలాగే, ఈ నెల 11 నాటికి 2,38,759 మంది ఉన్నారని చెప్పారు. కొత్తగా 25,013 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

వాటిలో 7,247 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని చెప్పారు. ఓటరు జాబితా సవరణ నేటితో పూర్తవుతుందని తెలిపారు. దీంతో మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు సూచనలు ఏం కనపడడం లేదని కోర్టు తెలిపింది. కాగా, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా మునుగోడులో ఉంటూ ప్రచారంలో మునిగితేలుతున్నారు. బీజేపీ రేపటి నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు