Etela Rajender:కరోనా లేదు : నా పౌల్ట్రీకి రూ. 10 కోట్ల నష్టం వచ్చింది – ఈటల

తెలంగాణ రాష్టంరంలో కరోనా లేదని, పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తనకు చెందిన పౌల్ట్రీలో రూ. 10 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు. చికెన్

Etela Rajender:కరోనా లేదు : నా పౌల్ట్రీకి రూ. 10 కోట్ల నష్టం వచ్చింది – ఈటల

My Poultry Costs Rs 10 Cror

Updated On : December 21, 2021 / 10:47 AM IST

Etela Rajender:తెలంగాణ రాష్టంరంలో కరోనా లేదని, పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తనకు చెందిన పౌల్ట్రీలో రూ. 10 కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించారు. చికెన్ తినండి..పౌల్ట్రీ రంగాన్ని ఆదరించాలని ప్రజలకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2020, మార్చి 12వ తేదీ గురువారం నాడు జరిగిన సభలో…పౌల్ట్రీ రంగంలో స్కాం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించారు. మక్కలను కాజేశారని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి మంత్రి ఈటల కౌంటర్ ఇచ్చారు.

వందల కోట్ల రూపాయల స్కాం జరిగిందంటూ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. తనకు నాలుగు వేల టన్నులు మాత్రమే వచ్చాయని, టన్నుకు రూ. 18 చొప్పున రూ. 6.50 లేదా రూ. 7 కోట్లు అయ్యిందన్నారు. నాకు రూ. 300 కోట్లు ఎలా వస్తాయని సూటిగా ప్రశ్నించారు. ప్రతిపక్షాలు చేస్తున్న గాలి ప్రచారంతో పౌల్ట్రీ రంగానికి తీవ్ర నష్టం వచ్చిందని, రూ. 1000 కోట్లు నష్టం వచ్చిందన్నారు.

అంతకముందు సీఎం కేసీఆర్…కూడా ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయవద్దన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే..ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో అందరికీ తెలిసిందేనన్నారు. అయినా..వారిలో ప్రవర్తనలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు.

Read More : తెలంగాణ బడ్జెట్ : మోదీని నమ్ముకుంటే..శంకరగిరిమాన్యాలే – కేసీఆర్