హైదరాబాద్ : ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో
హైదరాబాద్: ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటికే ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎంపీలు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేసింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైసీపీ చీఫ్ జగన్‌ను కలిశారు. జగన్‌తో నార్నె భేటీ ఏపీ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మర్యాదపూర్వకంగానే జగన్‌తో భేటీ అయినట్లు నార్నె శ్రీనివాసరావు చెబుతున్నారు. వీరి భేటీ టీడీపీ శ్రేణుల్లో ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నార్నె.. జగన్‌ను ఎందుకు కలిశారు.. ఆయనతో ఏం మాట్లాడారు.. రాజకీయ అంశాల గురించి ముచ్చటించారా.. అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. టీడీపీలోనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.
నార్నె శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకి బంధువు అవుతారు. నార్నె శ్రీనివాస రావు భార్య చంద్రబాబు అక్క కూతురు. నార్నె కూతురు లక్ష్మీ ప్రణతిని జూ.ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. జూ.ఎన్టీఆర్ నార్నె అల్లుడు కావడానికి ప్రముఖ పాత్ర వహించింది చంద్రబాబే. నార్నె.. స్టూడియో-N చానల్ అధిపతి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గుంటూరు లోక్ సభ లేదా చిలకలూరిపేట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు నార్నె ఆసక్తి చూపించారని వార్తలు వచ్చాయి. టికెట్ విషయమై ఆయన జగన్‌ను కలిశారని, అయితే టిక్కెట్ కావాలంటే జూనియర్ ఎన్టీఆర్‌తో వైసీపీ తరఫున ప్రచారం చేయించాలని జగన్ కండిషన్ పెట్టినట్టు వార్తలొచ్చాయి.