Bihar Politics: ప్రధాని మోదీని ఛాలెంజ్ చేసే ప్రతిపక్ష నాయకుడే లేడట.. అమిత్ షాను కలవగానే స్వరం మార్చిన మాంఝీ

వాస్తవానికి మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన నితీశ్ కేబినెట్లో ఎస్సీ, ఎస్ట సంక్షేమ శాఖా మంత్రి. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం మహా కూటమిలో భాగమై ఉన్నట్లే భావిస్తున్నానని మాంఝీ అన్నారు

Bihar Politics: ప్రధాని మోదీని ఛాలెంజ్ చేసే ప్రతిపక్ష నాయకుడే లేడట.. అమిత్ షాను కలవగానే స్వరం మార్చిన మాంఝీ

Jitan Ram Manjhi

Jitan Ram Manjhi: ప్రధానమంత్రి నరేంద్రమోదీని విపక్షంలోని ఏ నాయకుడు ఛాలెంజ్ చేయలేరని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తాన్ ఆవామ్ మోర్చా అధినేత జితన్ రాం మాంఝీ అన్నారు. గురువారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుసుకున్నారు. ఆ మర్నాడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘విపక్షాలు ఏకం కావడానికి ప్రయత్నిస్తున్నాయి. మంచి పరిణామమే. కానీ, వాళ్లు కలిసినా ఏమీ చేయలేరు. ఎందుకంటే, ప్రధాని మోదీని ఎదుర్కునే నాయకుడు అందులో ఒక్కరు కూడా లేరు’’ అని అన్నారు.

Opposition Meet: విపక్షాల మీటింగుపై బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు

ఇక తమ పార్టీ (హెచ్ఏఎం)ని జేడీయూలో కలిపేందుకు నితీశ్ కుమార్ ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారని, అలా చేసి ఉండకపోతే తాము మహాకూటమిలోనే ఉండేవారిమని అన్నారు. ఇక ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించిన ఆయన నితీశ్ లాగ బీజేపీ తమపై విలీన ఒత్తిడి తీసుకురాలేదని, మిత్రపక్షంగా ఉండేందుకు అంగీకరించడం వల్లే తాము ఎన్డీయేతో భాగస్వామ్యం అయ్యామని స్పష్టం చేశారు.

Maharashtra Politics: అజిత్ పవార్‭కు పార్టీ పదవి వచ్చినట్టేనట.. క్లారిటీ ఇచ్చిన సుప్రియా సూలే

వాస్తవానికి మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన నితీశ్ కేబినెట్లో ఎస్సీ, ఎస్ట సంక్షేమ శాఖా మంత్రి. అయితే మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం మహా కూటమిలో భాగమై ఉన్నట్లే భావిస్తున్నానని మాంఝీ అన్నారు. ఇది జరిగి వారం కాలేదు. అప్పుడే అమిత్ షాతో భేటీ అవ్వడం, ఎన్డీయేలో భాగస్వామ్యం కావడం చకచకా జరిగిపోయాయి.

Opposition meet: విపక్షాల సమావేశంలో పాల్గొనడానికి పట్నాకు మమతా బెనర్జీ.. కీలక వ్యాఖ్యలు

జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత మహా కూటమిలో చేరారు. దీంతో సుమన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్న నితీశ్.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. బిహార్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరికి సంతోష్ తన రాజీనామా లేఖను సమర్పించారు.