పవన్ యుద్ధం వ్యాఖ్యలు.. పాకిస్తాన్ మీడియాలో బ్రేకింగ్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ లోని ప్రముఖ మీడియా సంస్థ “డాన్” తన వెబ్‌సైట్‌లో పెట్టింది. గత ఎన్నికల్లో మోడీ ప్రధాని అయ్యేందుకు కృషి చేసిన హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ తో యుద్ధం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారంటూ పాకిస్తాన్ పత్రిక “DAWN” తన వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది.
Read Also : షోయాబ్.. హైదరాబాద్ వస్తే తాట తీస్తాం: నెటిజన్స్ ఫైర్
పవన్ వ్యాఖ్యలు ఇవేనంటూ డాన్ వెబ్‌సైట్ వాటిని ప్రత్యేకంగా హైలైట్ చేసింది… “యుద్ధం వస్తుందని నాకు రెండేళ్ళ కిందటే బీజేపీ వాళ్లు చెప్పారు. దీన్ని బట్టి మన దేశంలో ఎలాంటి పరిస్థితి ఉందనేది అర్థం చేసుకోవచ్చు” అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయగా ఆ వార్తను ప్రత్యేకంగా డాన్ ప్రస్తావించింది.
కడప జిల్లాలో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఎన్నికలకు ముందు పాకిస్తాన్ తో యుద్ధం రావొచ్చు అని నాకు రెండేళ్ల క్రితమే తెలుసును అంటూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ విషయాన్ని నేషనల్ మీడియా హైలెట్ చేసింది. ఇదే విషయాన్ని డాన్ తన మెయిన్ సైట్ ఊటంకిస్తూ కథనం రాసింది. గతంలో బీజేపీతో పవన్ కళ్యాణ్ కు సంబంధాలు ఉన్నాయని కూడా తెలిపింది.
Read Also : ఇమ్రాన్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలట : పాక్ డిమాండ్
బీజేపీ నేతలు మాత్రమే దేశభక్తులన్నట్లుగా చెప్పుకుంటున్నారని, దేశభక్తి కేవలం బీజేపీ హక్కు కాదని, వారికంటే తాము 10 రెట్లు దేశభక్తులమని పవన్ చెప్పినట్లుగా ఆ కథనం వెల్లడించింది. భారత్‌లోని ముస్లింలు వారి దేశభక్తిని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని, సమాజంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు జరిగే ప్రయత్నాలను విఫలం చెయ్యాల్సిందిగా పవన్ కళ్యాణ్ కోరినట్లు ఆ కథనంలో వెల్లడించింది.
Read Also : మనుషులు బతకాలంటే…ఉగ్రశిబిరాలను ధ్వంసం చేయాల్సిందే