ఢిల్లీ చేరిన పవన్ కళ్యాణ్ : కాసేపట్లో జేపీ నడ్డాతో భేటీ

  • Publish Date - January 11, 2020 / 03:54 PM IST

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు.  మరి కొద్ది సేపట్లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్  జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఏపీలో రాజధాని తరలింపు అంశంపై అమరావతి  ప్రాంత రైతులు చేస్తున్నఆందోళనలను వివరించనున్నారు. అమరావతితో సహా  పలురాజకీయ విషయాలను వారిరువురూ చర్చించనున్నారు.  

పవన్ కళ్యాణ్ రేపు ఆదివారం కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు.  పవన్ కళ్యాణ్  రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బేటీ అయ్యే అవకాశం ఉంది.  పవన్ వెంట ఆ పార్టీకి చెందిన కీలకనేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

కాగా…. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో  కీలక నేతలతో సమావేశం లో స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పొత్తుల విషయమై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో  బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ రావటంతో వెంటనే బయలు దేరి ఢిల్లీ వెళ్లారు.