విజయవాడలో లక్ష మందితో పవన్ కళ్యాణ్ కవాతు

రాజధాని రైతుల కోసం జనసేనాని రంగంలోకి దిగుతున్నారు. అమరావతి పరిరక్షణ పేరుతో నిరసన కవాతు చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో కనీసం లక్ష మందితో కవాతు చేయాలని ప్లాన్ చేయబోతున్నారు.

  • Publish Date - January 10, 2020 / 02:00 AM IST

రాజధాని రైతుల కోసం జనసేనాని రంగంలోకి దిగుతున్నారు. అమరావతి పరిరక్షణ పేరుతో నిరసన కవాతు చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో కనీసం లక్ష మందితో కవాతు చేయాలని ప్లాన్ చేయబోతున్నారు.

రాజధాని రైతుల కోసం జనసేనాని రంగంలోకి దిగుతున్నారు. మొన్న క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకుని వెళ్లిపోయిన సేనాపతి.. ఈసారి యుద్ధం ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ వారం రోజుల పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాజధానిపై పోరాటం చేయాలని డిసైడ్‌ అయ్యారు. ఇందుకు తగిన యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటున్నాడు.

నేను విన్నాను.. నేను ఉన్నాను అనేది జగన్‌ డైలాగ్‌. కాని, పవన్‌ కూడా ఇదే ఫాలో అవుతున్నాడు. మొన్న అమరావతి ప్రాంతానికి వచ్చినప్పుడు స్థానిక రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం ప్రాంతాల్లో పర్యటించిన రైతులు ఏం కోరుతున్నారన్న దానిపై క్లారిటీ తీసుకున్నారు. ఇప్పుడు యాక్షన్‌లోకి దిగబోతున్నారు. 

రాజధాని రైతులకు అండగా ఉంటానని ఇప్పటికే ప్రకటించిన పవన్‌.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఆందోళనలు చేయాల్సిందేనని డిసైడ్ అయ్యారు. రాజధాని రైతుల కోసం రంగంలోకి దిగుతున్న జనసేనాని.. అమరావతి పరిరక్షణ పేరుతో నిరసన కవాతు చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో చేపట్టబోయే ఈ కవాతులో కనీసం లక్ష మంది ఉండేలా ప్లాన్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్‌ చేసేందుకు ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. 

జనసేన అధినేత పవన్‌ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. పవన్‌ అధ్యక్షతన వారం రోజులపాటు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలకు జనసేన రూపకల్పన చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ మంగళగిరి కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు పవన్‌. రాజధాని అంశంపై పార్టీ నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశం తరువాత కవాతు తేదీని, భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు జనసేనాని.