గ్రేటర్‌ ఎన్నికలకు పోలీస్‌శాఖ భారీ బందోబస్తు

  • Published By: sreehari ,Published On : December 1, 2020 / 06:51 AM IST
గ్రేటర్‌ ఎన్నికలకు పోలీస్‌శాఖ భారీ బందోబస్తు

Updated On : December 1, 2020 / 6:08 PM IST

Greater Hyderabad Elections : బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. GHMC పరిధిలోకి వచ్చే హైదరాబాద్‌ , సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో భారీగా బలగాలను మోహరించింది. మొత్తం 51 వేల 500ల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో 43 వేల మంది పోలింగ్‌ కేంద్రాల దగ్గర బందోబస్తులో ఉండగా 7,000ల మందికి పైగా పోలీసులకు మొబైల్‌ , స్పెషల్‌ పార్టీలుగా ఎలక్షన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కమిషనరేట్ల వారీగా పరిశీలిస్తే హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 84 డివిజన్లు పూర్తిగా 5 డివిజన్లు పాక్షికంగా ఉన్నాయి. వీటి పరిధిలో 4వేల 979 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి.

ఇక్కడ 22 వేల మంది పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 38 డివిజన్లు ఉండగా 2వేల 569 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ 13వేల 500 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 28 డివిజన్లలో 16వందల 40 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా సుమారు 8వేల మంది పోలీసులు ఎలక్షన్‌ డ్యూటీ చేస్తున్నారు. GHMC పరిధిలో ప్రతీ సర్కిల్‌కు ఏసీపీ పర్యవేక్షణలో స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచారు. ఎక్కడైనా ఆపద వస్తే వెంటనే స్పందించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీంలతో పాటు 6 సాయుధ దళాలను అందుబాటులో ఉంచారు. ప్రత్యేక షీ టీమ్‌లను ఏర్పాటు చేశారు.

ఎటువంచి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3వేల 66 మంది రౌడీషీటర్లను బైండోవర్‌ చేశారు. ఇందులో రౌడీలు 11వందల 67, అనుమానితులు వెయ్యి 14మంది, ఇతరులు 604 మంది ఉన్నారు. ఇక లైసెన్స్‌డ్‌ వెపన్స్‌కి సంబంధించి 4వేల 187 ఆయుధాలను డిపాజిట్‌ చేశారు. కమిషనరేట్ల వారీగా సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసి సమ్యస్యాత్మక ప్రాంతాల బాధ్యతలు అప్పగించారు. 4 లక్షల సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పడు పరిస్థిని అంచనా వేసేందుకు స్టాటిక్‌ సర్వైలెన్స్‌ టీమ్‌లు ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లు పర్యవేక్షణ బాధ్యతలు ఏసీపీ స్థాయి అధికారులకు అప్పగించారు. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత GHMC పరిధిలో ఇప్పటి వరకు మొత్తం 1 కోటి 40 లక్షల 87 వేల 450 నగదు సీజ్‌ చేశారు. పోలీస్‌ తనిఖీల్లో 80 గ్రాముల డ్రగ్స్‌ పట్టుబడింది. దీని విలువల 10 లక్షలు కాగా 2 కేజీల 100 గ్రాముల గంజాయి దొరికింది.