ఆపరేషన్ ఆకర్ష్ : వైసీపీలోకి వలసల జోరు?
వైసీపీలోకి వలసల జోరు ఊపందుకుంటోందా..? టీడీపీ నుంచి మరికొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంపవనున్నారా..?

వైసీపీలోకి వలసల జోరు ఊపందుకుంటోందా..? టీడీపీ నుంచి మరికొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంపవనున్నారా..?
అమరావతి : వైసీపీలోకి వలసల జోరు ఊపందుకుంటోందా..? టీడీపీ నుంచి మరికొంత మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంపవనున్నారా..? కొత్తగా చేరుతున్న నేతలకు వైసీపీ అధినేత ఫిబ్రవరి 20ని డెడ్‌లైన్‌గా నిర్ణయించారా..? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వలసల జోరు ఊపందుకుంటోంది. వైసీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్శ్‌తో టీడీపీ నేతలు క్యూకడుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మొన్నా మధ్య చేరిన మరో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరు కాకుండా మరో 14 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని వైసీపీ చెబుతోంది. వీరిలో ఇప్పటికే 8 మంది సుముఖత వ్యక్తం చేశారంటోంది. వైసీపీ లెక్కల్లో వాస్తవం ఎంతుందో తెలియదు గానీ.. ఇలా వచ్చే నేతలకు వైసీపీ అధినేత జగన్.. ఫిబ్రవరి 20ని డెడ్‌లైన్‌గా పెట్టారట. ఫిబ్రవరి 20 లోపు వచ్చేవారికే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. ఈ నెల 18 నుంచి మార్చి 18 వరకు విదేశీ పర్యటనలకు వెళ్లడానికి కోర్టు జగన్‌కు అనుమతిచ్చింది. ఈ నెల 20 రాత్రి ఆయన లండన్ వెళ్తున్నారు. 25న తిరిగి వస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. అందుకే ఈ నెల 20లోపు వీలైనంత ఎక్కువ మందిని పార్టీలో చేర్చుకునేందుకు జగన్ ప్లాన్ చేసుకున్నారట.
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల చివరి వారంలో గానీ, మార్చి మొదటి వారంలోగానీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలో చేరాలనుకునేవారు ఫిబ్రవరి 20లోపు చేరితే.. టిక్కెట్ల కేటాయింపు విషయంలో సమస్యలు తలెత్తవని జగన్ ఆలోచన. టీడీపీ నుంచి వైసీపీలో చేరుతారని ప్రచారంలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేల ఆలోచన మారకముందే.. పార్టీలో చేర్చుకోవడానికి జగన్ ఫిబ్రవరి 20ని డెడ్‌లైన్ పెట్టారని.. ఆ తర్వాత కూడా చేరికలుంటాయని మరి కొందరంటున్నారు.
టీడీపీ నేతలతో పాటు కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లపై కూడా వైసీపీ దృష్టి పెట్టింది. గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళా నేతలతోపాటు ఎంపీలుగా పనిచేసిన కొందరితో వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన సీనియర్లు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్ లాంటి ప్రభావం చూపే నేతలు టీడీపీలో చేరడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. వచ్చే నేతల వల్ల ఉపయోగం ఉందా లేదా అనేకంటే తమకు బలం ఉందని చూపించుకోవడం కూడా వైసీపీకి అవసరంగా మారింది. అలాగే ఎంపీల విషయానికోస్తే.. ఆర్థిక బలమే ప్రధాన అర్హతగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు.
ఐతే టీడీపీ నుంచి నేతల వలసలు పెరగడంతోని వైసీపీ యోజకవర్గ ఇంఛార్జులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఆశావహుల్లో గుబులు మొదలైంది. తమ సీటుకు ఎక్కడ ఎసరు పెడతారోనన్న భయం వెంటాడుతోంది. పార్టీలోకి వచ్చేవారి నుంచి ఎలాంటి కండిషన్స్ లేకుండా చేర్చుకోవాలని వైసీపీ శ్రేణులంటున్నాయి.
Also Read : ఎన్నికల వేళ : పార్టీలకు జంప్ జిలానీల టెన్షన్
Also Read : ఎమ్మెల్సీ పదవికి సోమిరెడ్డి రాజీనామా : ఎమ్మెల్యేగా పోటీ
Also Read : గురు శిష్యుల వివాదం : భీమిలి నియోజకవర్గం ఎవరి పరం?