థర్టీ.. డర్టీ : SVBC చైర్మన్ పదవికి పృధ్వీ రాజీనామా

ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృధ్వీ రాజీనామా చేశారు. ఎస్వీబీసీ ఛానల్ లో పనిచేసే ఉద్యోగినితో పృథ్వీ జరిపిన ఫోన్ సంభాషణను టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో పృథ్వీపై వేటు వేసేందుకు టీటీడీ సిద్ధమైంది. ఈవిషయాన్ని టీటీడీ పాలక మండలిచైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం ఈవిషయంలో పృధ్వీ రాజీనామాచేయాలని చెప్పటంతో వైవీ ఆదేశాల మేరకు పృధ్వీ రాజీనామా చేశారు.