Rahul Gandhi: ఎట్టకేలకు పెళ్లిపై సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ.. ఆ క్వాలిటీస్ ఉండే అమ్మాయి అయితే ఓకేనట
బీజేపీ నేతలు తనను పప్పు అనడంపై రాహుల్ స్పందిస్తూ ‘‘నేను అలాంటివి పట్టించుకోను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను ఎవరినీ ధ్వేషించను. మీరు నన్ను కొట్టినా నేను ధ్వేషించను. నన్ను పప్పు అని పిలవడాన్ని నేను ప్రచారంగా భావిస్తాను. నిజానికి వాళ్లు భయంతోనే నన్ను అలా పిలుస్తున్నారు. వాళ్ల జీవితంలో సరిగా లేని వాళ్లు వేరొకరిని దుర్భషలాడుతారు. దాన్ని నేను స్వాగతిస్తాను. మీరు నాకెన్నైనా పేర్లు పెట్టండి. వాటిని పట్టించుకోను’’ అని అన్నారు.
To a question about a spouse, Rahul Gandhi said that if she has those qualities, it's fine
Rahul Gandhi: ఇండియాలో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. చాలా కాలంగా రాహుల్ పెళ్లి గురించి చర్చ కొనసాగుతోంది. ఈ విషయమై ఆయన అనేక సార్లు ప్రశ్నలు ఎదుర్కొన్నారు, ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఈ విషయమై ఎప్పుడు వచ్చినా దాటవేసే రాహుల్, ఉన్నట్టుండి కాస్త సానుకూలంగా స్పందించారు. ‘అలాంటి క్వాలిటీస్ ఉంటే ఓకే’ అంటూ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం 52 ఏళ్లు ఉన్న రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
Pragya Thakur: హిందువులు కత్తులు వాడాలంటూ వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ సాధ్వీపై కేసు
తన తల్లి సోనియా గాంధీ, నాయనమ్మ ఇందిరా గాంధీల గుణాలు కలగలిసిన భాగస్వామితో అయితే జీవితంలో స్థిరపడేందుకు సిద్ధమని రాహుల్ తెలిపారు. పెళ్లి గురించి అడిగిన క్రమంలో రాహుల్ ఇచ్చిన సమాధానం ఇది. వాస్తవానికి తన నాయనమ్మ ఇందిరా గాంధీ తనకు రెండో తల్లి లాంటిదని రాహుల్ అన్నారు. అయితే ఆమె లాంటి మహిళ దొరికితే జీవితంలో స్థిరపడతారా అని ప్రశ్నించగా ‘‘చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అలాంటి లక్షణాలు ఉన్న మహిళకు ప్రాధాన్యత ఇస్తాను. నా తల్లి, నాయనమ్మ గుణాలు కలగలిన మహిళ అయితే జీవిత భాగస్వామిగా ఇష్టపడతాను’’ అని అన్నారు.
ఇక తనకున్న వ్యక్తిగత అభిరుచుల గురించి రాహుల్ చెప్పుకొచ్చారు. తనకు మోటార్ సైకిళ్లు, సైకిళ్లు నడపడం చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ మోటార్లతో సైకిళ్లు, పర్వత బైక్‌లను తయారు చేసే చైనా ఎలక్ట్రిక్ కంపెనీని గురించి ప్రస్తావించారు. “నేను ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపాను. కానీ ఎప్పుడూ ఎలక్ట్రిక్ బైక్ నడపలేదు. ఈ చైనీస్ కంపెనీని చూశారా… ఎలక్ట్రిక్ మోటార్లతో సైకిల్స్, పర్వత బైక్‌లు తయారు చేస్తున్నారు. చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. అవి బాగున్నాయి” అని అన్నారు. వాహనాల పట్ల ఆసక్తిగానే రాహుల్‌కు సొంత కారు లేదని అన్నారు. తన తల్లి కారు ‘సీఆర్-వీ’ని ఉపయోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక బీజేపీ నేతలు తనను పప్పు అనడంపై రాహుల్ స్పందిస్తూ ‘‘నేను అలాంటివి పట్టించుకోను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నేను ఎవరినీ ధ్వేషించను. మీరు నన్ను కొట్టినా నేను ధ్వేషించను. నన్ను పప్పు అని పిలవడాన్ని నేను ప్రచారంగా భావిస్తాను. నిజానికి వాళ్లు భయంతోనే నన్ను అలా పిలుస్తున్నారు. వాళ్ల జీవితంలో సరిగా లేని వాళ్లు వేరొకరిని దుర్భషలాడుతారు. దాన్ని నేను స్వాగతిస్తాను. మీరు నాకెన్నైనా పేర్లు పెట్టండి. వాటిని పట్టించుకోను’’ అని అన్నారు.
