Controversies in India: 2022 కాంట్రవర్సీనామ సంవత్సరం.. ఈ ఏడాదిలో దేశాన్ని కుదిపివేసిన 5 ప్రధాన కాంట్రవర్సీలు

కాంట్రవర్సీలు లేని దేశం ఉండదు. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గర దానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. భావప్రకటన ఉన్న దగ్గర భిన్న అభిప్రాయాలు సంఘర్షిస్తాయి. ఆ సంఘర్షణలోంచి కాంట్రవర్సీలు పుట్టుకొస్తాయి. అలాగే దేశంలో అనేక కాంట్రవర్సీలు కొనసాగాయి. ముఖ్యంగా 2022 ఏడాది అయితే కాంట్రవర్సీనామ సంవత్సరంగా నామకరణం చేయొచ్చు

Controversies in India: 2022 కాంట్రవర్సీనామ సంవత్సరం.. ఈ ఏడాదిలో దేశాన్ని కుదిపివేసిన 5 ప్రధాన కాంట్రవర్సీలు

5 controversies that rocked India in 2022

Updated On : December 28, 2022 / 7:45 PM IST

Controversies in India: కాంట్రవర్సీలు లేని దేశం ఉండదు. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గర దానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. భావప్రకటన ఉన్న దగ్గర భిన్న అభిప్రాయాలు సంఘర్షిస్తాయి. ఆ సంఘర్షణలోంచి కాంట్రవర్సీలు పుట్టుకొస్తాయి. అలాగే దేశంలో అనేక కాంట్రవర్సీలు కొనసాగాయి. ముఖ్యంగా 2022 ఏడాది అయితే కాంట్రవర్సీనామ సంవత్సరంగా నామకరణం చేయొచ్చు. హిజాబ్ వివాదం నుంచి కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు అంశం వరకు కొందరికి నిద్రలేని రాత్రులుగా మిగిలాయి ఈ కాంట్రవర్సీలు. అయితే ఈ ఏడాది దేశాన్ని కుదిపివేసిన ఐదు ప్రధాన కాంట్రవర్సీల గురించి చెప్పుకుందాం.

Rajasthan: మనుస్మృతి దహనం చేశారని ముగ్గురు అరెస్ట్

హిజాబ్ వివాదం:
కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపిలో ఉన్న పీయూ కాలేజీలో మొదలైన ఈ వివాదం దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపేసింది. విద్యార్థుల యూనిఫాం విషయంలో పీయూ కాలేజీ గతేడాది జూన్‭లో తెచ్చిన మార్గదర్శకాలు ఈ వివాదానికి కారణమై ఈ ఏడాదిలో ప్రధాన వివాదంగా మారింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా హిందూ సంఘాలకు చెందిన విద్యార్థులు కాషాయ శాలువాలతో కాలేజీకి రావడం, అనంతరం హిజాబ్ అనుకూల ఆందోళనలు చెలరేగడం.. రాజకీయంగా పెద్ద దుమారమే కొనసాగింది. ఈ విషయమై కొందరు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. యూనిఫాం డ్రెస్ కోడ్ ను పాటించాల్సిందేనంటూ కర్ణాటక ప్రభుత్వం 2022, ఫిబ్రవరి 5న ఆదేశాలు జారీచేసింది. అనంతరం ఇది సుప్రీం కోర్టుకు వెళ్లడం.. అక్కడ ఇద్దరు జడ్జీలు వేర్వేరు తీర్పులు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఈ కేసు సీజేఐ ముందు ఉంది. విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయడంపై ఆయన నిర్ణయం తీసుకుంటారు.

Lokayukta: చారిత్రాత్మక చట్టం చేసిన మహా అసెంబ్లీ.. లోకాయుక్త-2022 బిల్లుకి ఆమోదం

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వ్యాఖ్యలు:
హిజాబ్ వివాదానికి కొనసాగింపుగా వచ్చిన ఈ వివాదం.. దేశాన్ని దాటి గల్ఫ్ దేశాలకు కూడా అంటుకుంది. ఓ టీవీ ఛానల్‭లో చర్చ సందర్భంగా మహ్మద్ ప్రవక్తపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అయిన నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఇస్లాం దేశాలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో వెంటనే ఆమెను పార్టీ నుంచి తొలగించింది బీజేపీ. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమనగలేదు. నుపుర్ శర్మకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఆమెకు మద్దతుగా కూడా చాలానే జరిగాయి. ఇందులో భాగంగా ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ జూన్ 3న కాన్పూర్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇక ఎట్టకేలకు నుపుర్ శర్మ బహిరంగ క్షమాపణ చెప్పడంతో వివాదం కొంత వరకు సద్దుమణిగింది.

Rahul Gandhi: మోదీకి ధైర్యాన్ని, ప్రేమను ఇస్తూ అండగా నిలిచిన రాహుల్ గాంధీ

అగ్నివీర్‭కు వ్యతిరేకంగా ఆందోళన:
త్రివిధ దళాల్లో నియామకం కోసం తెచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై వచ్చిన వ్యతిరేకత దేశంలో వివాదంగా మారింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన నిరసన హింసాత్మమయ్యాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అల్లర్లతో పలువురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వచ్చింది. రైల్వే స్టేషన్లు తగలబెడుతూ నానా హంగామా జరిగింది. విషయం ఏంటంటే.. అగ్నిపథ్ పథకం ప్రకారం నాలుగేళ్ల తరువాత 25 శాతం మంది మాత్రమే పర్మినెంట్ సైనికులవుతారు. మిగిలినవారికి 11-12 లక్షల చొప్పున సెటిల్మెంట్ ప్యాకేజ్ ఇచ్చి పంపించేస్తారు. పెన్షన్ సౌకర్యం కూడా ఉండదు. ఇదే దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. మిలిటరీలో చేరాలనుకునే ఆశావాహలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.దీనికి తోడు అగ్నివీరులుగా నాలుగేళ్ల పూర్తి చేసుకున్న వారిని సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామని కేంద్రంలో పెద్దలు వ్యాఖ్యానించడం మరింత ఆగ్రహానికి కారణమైంది.

Jesus Statue Vandalise: కర్ణాటకలో మరో వివాదం.. క్రిస్మస్ జరిగిన మర్నాడే జీసెస్ విగ్రహాం ధ్వంసం

జ్ఞానవాపి మసీదు:
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో శివలింగం కనిపించందని, లోపల హిందూ దేవతల చిత్రాలు, ఇతర సంకేతాలు ఉన్నాయంటూ మొదలైన వివాదం వారణాసి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఒక వైపు హిందూ సంఘాల ఆరోపణలు మరొకవైపు, ముస్లిం సంఘాల నిరసనల నడుమ కోర్టులు సైతం ఏదీ తేల్చలేని సంకటం నెలకొంది. నిజానికి అక్కడ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని 30 ఏళ్ల క్రితమే వివాదం మొదలైంది. తాజాగా ఈ వివాదాన్ని ఐదుగురు మహిళలు సరికొత్త మలుపు తిరిగేలా చేశారు. మసీదు ప్రాంగణంలో గణపతి, హనుమంతుడి విగ్రహాలకు పూజలు జరిపించే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించడంతో తాజాగా మరోసారి దేశాన్ని కుదిపేసే కాంట్రవర్సీ చెలరేగింది.

Uma Bharti: మీకు స్వేచ్ఛ ఉంది, ఎవరికైనా ఓటేయొచ్చు.. పార్టీ హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్‭తో ఉమా భారతి వ్యాఖ్యలు, కలవరంలో బీజేపీ

శివసేనలో చీలిక:
పైవన్నీ రాజకీయంగా దుమారం లేపినప్పటికీ ప్రత్యక్షంగా రాజకీయాలతో సంబంధం లేని అంశాలు. అయితే 2022 ఏడాదిని కుదిపివేసిన రాజకీయ అంశం ఒకటుంది. అదే శివసేన చీలిక. మహారాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్ని అనుక్షణం ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ వివాదం.. ఎట్టకేలకు రెండు పార్టీలు, రెండు జెండాలు, రెండు ఎన్నికల గుర్తులతో ప్రస్తుతానికైతే సద్ధుమణిగిందనే చెప్పొచ్చు. ప్రజలు ఇచ్చిన తీర్పు కాకుండా భావజాలపరంగా పూర్తి విరుద్ధమైన కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏక్‭నాథ్ షిండే తిరుగుబాటు చేయడం, అనంతరం మహా వికాస్ అగాడీ ప్రభుత్వం కూలిపోవడం, ఫడ్నవీస్-షిండే కలయికలో ప్రభుత్వం ఏర్పడడం జరిగిపోయాయి. ఇక అసలైన శివసేన గొడవ కోర్టుకు ముందకు వెళ్లడం, ఎన్నికల సంఘం చొరవ తీసుకుని పార్టీని రెండుగా చీల్చడం వరకు మహారాష్ట్రలో ఒక రాజకీయ సంక్షోభం కొనసాగింది. ఇది దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపింది.