తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు : ఒక స్థానానికి అభ్యర్థి ఖరారు… మరొక స్థానంపై ఉత్కంఠ 

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో ఒక స్థానానికి అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది.

  • Published By: veegamteam ,Published On : March 10, 2020 / 02:52 AM IST
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు : ఒక స్థానానికి అభ్యర్థి ఖరారు… మరొక స్థానంపై ఉత్కంఠ 

Updated On : March 10, 2020 / 2:52 AM IST

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో ఒక స్థానానికి అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది.

తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాల భర్తీ విషయంలో ఒక స్థానానికి అభ్యర్థి పేరు దాదాపు ఖరారైంది. మరొక స్థానం పైనే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఆ స్థానం ఎవరికి దక్కుతుందనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

రెండు స్థానాలకు 12 మందికి పైగా నేతల పోటీ 
రాజ్యసభ నామినేషన్ల ఘటం మొదలైనా అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఈనెల 13వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. పార్టీ ఖరారు  చేసిన అభ్యర్థులు దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉండటంతో ఆ అభ్యర్థులు ఎవరనే అంశంపై నేతల్లో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రాజ్యసభ అభ్యర్థుల విషయంలో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తూనే ఉంది. రెండు స్థానాలకు డజను మందికి పైగా నేతలు పోటీ పడుతున్నారు. 

కేకేకు మరోసారి అవకాశం? 
సామాజిక సమీకరణాలు, ఢిల్లీ అవసరాలు దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ఎంపిక జరిగే అవకాశం ఉంది. పదవీకాలం ముగుస్తున్న సీనియర్ నేత కేకేకు మరోసారి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో స్థానం ఏ సామాజిక వర్గానికి దక్కుతుందో అన్నది ఇప్పుడు  చర్చకు దారితీస్తోంది. పార్టీకి పూర్తి స్థాయిలో సహకారం అందించిన నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

సామాజిక సమీకరణాలే కీలకం
మాజీ ఎంపీలు కవిత, బోయినపల్లి  వినోద్ కుమార్, సీనియర్ నేత దామోదరరావు లలో ఒకరికి  అవకాశం దక్కవచ్చు అని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను పరిశీలిస్తే ఎస్సీలలో బాలమల్లు, కడియం శ్రీహరిల పేర్లు చర్చలో ఉండగా…. ఎస్టీలకు కేటాయిస్తే సీతారాం నాయక్, జి. నగేష్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పార్టీలో ప్రముఖంగా వినిపించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, హేటిరో అధినేత పార్థసారధి రెడ్డిల అభ్యర్థిత్వాల పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నెల 11 లేదా 13 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

See Also | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు…. టీడీపీ, సీపీఐ మధ్య కుదిరిన పొత్తు