Mayawati on Bidhuri Remarks: డానిష్ అలీపై బీజేపీ ఎంపీ చేసిన అవమానకర వ్యాఖ్యలపై స్పందించిన మాయావతి
రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేను హెచ్చరించారు

Bidhuri Remarks on Dnish Ali: లోక్‌సభలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ కున్వర్ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన అవమానకర వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను స్పీకర్ రికార్డు నుంచి తొలగించారని, అయితే ఇంత జరిగినా ఆయనపై సదరు పార్టీ తగిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు.
ఈ ఘటనపై శుక్రవారం ఆమె తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ‘‘సభలో బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను స్పీకర్ రికార్డు నుంచి తొలగించారు. అలాగే ఆయనను హెచ్చరించారు, సభలో క్షమాపణలు కూడా చెప్పారు. ఇంత జరిగినా ఆయనపై సదరు పార్టీ తగిన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం’’ అని ట్వీట్ చేశారు.
दिल्ली से भाजपा सांसद द्वारा बीएसपी सांसद श्री दानिश अली के खिलाफ सदन में आपत्तिजनक टिप्पणी को हालाँकि स्पीकर ने रिकार्ड से हटाकर उन्हें चेतावनी भी दी है व वरिष्ठ मंत्री ने सदन में माफी मांगी, किन्तु पार्टी द्वारा उनके विरुद्ध अभी तक समुचित कार्रवाई नहीं करना दुखद/दुर्भाग्यपूर्ण।
— Mayawati (@Mayawati) September 22, 2023
ఇదిలావుండగా, రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా భవిష్యత్తులో ఇలాంటి ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేను హెచ్చరించారు. గురువారం లోక్‌సభలో చంద్రయాన్-3 మిషన్‌పై చర్చలో పాల్గొన్న సందర్భంగా డానిష్ అలీపై బిధూరి అనుచిత పదజాలం ఉపయోగించారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించారు.