ఫీజు రీయింబర్స్‌మెంట్ : మోహన్‌బాబుపైనే శివాజీ సెటైర్స్
వ్యాపార ప్రయోజనాలతో నడుపుతున్న విద్యాసంస్థల సమస్యలపై ఎన్నికల సమయంలో ఆందోళన చేయడం వెనుక ఆంతర్యం ఏంటీ అని ప్రశ్నించారు సినీ నటుడు శివాజీ.

వ్యాపార ప్రయోజనాలతో నడుపుతున్న విద్యాసంస్థల సమస్యలపై ఎన్నికల సమయంలో ఆందోళన చేయడం వెనుక ఆంతర్యం ఏంటీ అని ప్రశ్నించారు సినీ నటుడు శివాజీ.
వ్యాపార ప్రయోజనాలతో నడుపుతున్న విద్యాసంస్థల సమస్యలపై ఎన్నికల సమయంలో ఆందోళన చేయడం వెనుక ఆంతర్యం ఏంటీ అని ప్రశ్నించారు సినీ నటుడు శివాజీ. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో జాప్యంపై మార్చి 22వ తేదీ శుక్రవారం తిరుపతిలో మోహన్‌బాబు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శివాజీ రెస్పాండ్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ర్ట ప్రయోజనాలపై మోహన్‌బాబు ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు శివాజీ. హక్కుల గురించి మాట్లాడే సమయంలో బాధ్యతలు కూడా నెరవేర్చాలని సెటైర్స్ వేశారు. దీని వెనక మరో కోణం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు నటుడు శివాజీ.
Read Also : సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు : జగన్
అంతకంటే ముందు తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపులపై విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీకి మోహన్‌బాబు ప్రయత్నించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఎన్నికల కోడ్ దృష్ట్యా ర్యాలీకి అనుమతి లేదన్నారు. మోహన్‌బాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా శ్రీ విద్యానికేతన్ వద్ద పోలీసు బలగాలు మోహరించాయి. శివాజీ చేసిన కామెంట్స్‌పై డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.
Read Also : తెలుగుదేశం గూటికి మాజీ మంత్రి కొణతాల