వీధుల్లో కొట్టుకున్నారు : ఉండిలో టీడీపీ – వైసీపీ రాళ్ల దాడులు

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం రణరంగం అయ్యింది. టీడీపీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్లపై కొట్టుకున్నారు. రాళ్లతో బీభత్సం చేశారు. రాళ్లు, కర్రలు విసురుకుంటూ రోడ్లను యుద్ధభూమిగా మార్చారు. టీడీపీ అభ్యర్థి రామరాజు – వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు నామినేషన్లు వేయటానికి బయలుదేరారు. మధ్యాహ్నం మంచి ముహూర్తం కావటంతో.. ఇద్దరూ ఒకేసారి నామినేషన్ పత్రాలు దాఖలు చేయటానికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి భారీ ర్యాలీగా వచ్చారు. రెండు వర్గాలు ఉండి మెయిన్ సెంటర్ లో ఎదురుపడ్డాయి. ఇద్దరు అభ్యర్థులు భారీగా జనసమీకరణ చేయటంతో… ఒక్కో వర్గం వైపు 20వేల మంది కార్యకర్తలు ఉన్నారు. అందరూ కలిసి 40వేల మంది జనం ఒకేచోటకు చేరుకున్నారు.
Read Also : ఎన్నికల టైంలో ఐటీ రైడ్స్ ఎలా చేస్తారు : ఈసీకి శివాజీ కంప్లయింట్
టీడీపీ – వైసీపీ కార్యర్తలు ఉండి సెంటర్ లో ఎదురెదురు పడ్డారు. దీంతో రెచ్చిపోయిన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. జై చంద్రబాబు – జై జగన్ స్లోగన్స్ తో ఆ ప్రాంతం మార్మోగింది. ఇదే సమయంలో ఆవేశానికి గురైన కార్యకర్తలు.. చేతలకు దిగారు. అది కొట్లాటకు దారి తీసింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో 10 మందికి గాయాలయ్యాయి. ఒకరికి సీరియస్ గా ఉంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో.. భారీ ఎత్తున పోలీసులు రంగంలోకి దిగారు. లాఠీఛార్జీతో చెదరగొట్టారు.
Read Also : సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు : జగన్