నేనే కేర్ తీసుకుంటా… ప్రతి నెల గ్రామ పంచాయతీలకు డబ్బులు పంపిస్తా : సీఎం కేసీఆర్ 

రాష్ట్ర అభివృద్ధికి పల్లె ప్రగతి దోహదపడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాల్లో మార్పు వచ్చిందన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 13, 2020 / 06:40 AM IST
నేనే కేర్ తీసుకుంటా… ప్రతి నెల గ్రామ పంచాయతీలకు డబ్బులు పంపిస్తా : సీఎం కేసీఆర్ 

Updated On : March 13, 2020 / 6:40 AM IST

రాష్ట్ర అభివృద్ధికి పల్లె ప్రగతి దోహదపడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాల్లో మార్పు వచ్చిందన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి పల్లె ప్రగతి దోహదపడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాల్లో మార్పు వచ్చిందన్నారు. పల్లె ప్రగతిలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. పల్లె ప్రగతిపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ వ్యవస్థలను బలోపేతం చేస్తామని చెప్పారు. తానే గ్రామాలపై కేర్ తీసుకుంటానని ప్రతి నెల గ్రామ పంచాయతీలకు డబ్బులు పంపిస్తామని చెప్పారు. 

గ్రామ కార్యదర్శుల సంఖ్యం పెంచుతామని… ప్రతి గ్రామానికి కార్యదర్శి ఉండేలా చూస్తామని చెప్పారు. నిధుల వినియోగంలో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రణాళికబద్ధంగా సాగాలని..అందుకని వార్షిక ప్రణాళిక అవసరం అన్నారు. పంచవర్ష ప్రణాళిక కూడా అవసరమే అన్నారు. ప్రణాళిక ప్రకారం పాలన సాగితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. 

అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నామని చెప్పారు. కుల వృత్తులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. గ్రామ బడ్జెట్ లో 10 శాతం నిధులు పచ్చదనానికి వినియోగించాలన్న నిబంధనతో 2020-21 అన్ని గ్రాంట్లతో కలిపి రూ.369 కోట్లతో గ్రీన్ బడ్జెట్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. 

నాటి ప్రధాని నెహ్రూ..ఎస్ కే డేకు రాజ్యసభ సభ్యత్వం కల్పించి, కమ్యూనిటీ డెవలప్ మెంట్ పోర్టుపోలియోను సృష్టించి, కేబినెట్ మంత్రి హోదాను ఇచ్చి దాన్ని ఆయనకు అప్పగించారని తెలిపారు. ఎస్ కే డే హైదరాబాద్ ను ఎంచుకుని రాజేంద్రనగర్ లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ను స్థాపించారని తెలిపారు.

కమ్యూనిటీ డెవలప్ మెంట్ కోసం పంచాయతీరాజ్ ఉద్యమం, పేదల రైతులకు రుణాలు లభించేందుకు కోసం సహకార ఉద్యమంగా తీసుకెళ్లారని తెలిపారు. అట్లాంటి కమ్యూనిటీ డెవలప్ మెంట్ ద్వారా గ్రామాలను ఏకీకృతం చేయాల్సిందిపోయి.. ఇవాళ మద్యం ఏరులై పారుతోందన్నారు. 

See Also | శభాష్ శంభూ: కేరళలో కరోనాని కనుక్కొన్న డాక్టర్