Tamil Nadu Politics: అవును, మాది కుటుంబ పార్టీనే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్

తమిళనాడు రాష్ట్రాన్ని ఐదు దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలే పరిపాలిస్తున్నాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని బీజేపీ వంటి ప్రత్యర్థులు నేటికీ గుర్తించకపోవడం గర్హనీయమని స్టాలిన్ అన్నారు.

Tamil Nadu Politics: అవును, మాది కుటుంబ పార్టీనే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్

Updated On : June 30, 2023 / 8:55 AM IST

Stalin vs Modi: డీఎంకే పార్టీ కుటుంబ పార్టీయని, తమ పార్టీలోని వారంతా కుటుంబ సభ్యులేనని ఆ పార్టీ చీఫ్ స్టాలిన్ అన్నారు. డీఎంకే కుటుంబ పార్టీ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన విమర్శలపై స్పందిస్తూ స్టాలిన్ ఈ విధంగా స్పందించారు. పార్టీ వ్యవస్థాపకుడు అన్నాదురై పార్టీ ప్రముఖులను, కార్యకర్తలను తమ్ముడూ అని పిలిచేవారని, మాజీ ముఖ్యమంత్రి కరుణానిది సైతం తోబుట్టువులారా అని సంబోధించేవారని గుర్తు చేశారు. దీనిని బట్టి పార్టీ శ్రేణులందరినీ కుటుంబంగానే భావించాలన్న విషయాన్ని పార్టీ వ్యవస్థాపకులే స్పష్టం చేశారని స్టాలిన్ అన్నారు.

Bandi Sanjay : ఉత్సవాల పేరుతో 5లక్షల కోట్లు అప్పు చేశారు, తెలంగాణ రావొద్దని కోరుకున్నారు- బండి సంజయ్

డీఎంకే ఉన్నత కార్యాచరణ మండలి సభ్యుడు గుమ్మిడిపూండి కే.వేణు మనవరాలు అశ్విని వివాహవేడుకకు హాజరైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ ‘‘డీఎంకే కుటుంబ రాజకీయాలు జరుపుతోందని మోదీ అన్నారు. డీఎంకే కుటుంబాలే యేళ్లతరబడి అభివృద్ధి చెందుతున్నాయని కూడా విమర్శించారు. వాస్తవానికి డీఎంకే శ్రేణులంతా పార్టీ ఆధ్వర్యంలో జరిగే మహానాడు తదితర సభలు, ప్రజాందోళనల్లో పార్టీ ప్రముఖులు, నేతలు కుటుంబ సమేతంగా పాల్గొనటం ఆనవాయితీ. డీఎంకేకి ఓటేస్లే కరుణానిధి కుటుంబమే అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కరుణానిధి కుటుంబం అంటే రాష్ట్ర ప్రజలే’’ అని అన్నారు.

DMK Minister Senthil Balaji : తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి సంచలన నిర్ణయం..మంత్రి డిస్మిస్ ఉత్తర్వు వెనక్కి

తమిళనాడు రాష్ట్రాన్ని ఐదు దశాబ్దాలుగా ద్రావిడ పార్టీలే పరిపాలిస్తున్నాయని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని బీజేపీ వంటి ప్రత్యర్థులు నేటికీ గుర్తించకపోవడం గర్హనీయమని స్టాలిన్ అన్నారు. ఇటీవల బిహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్ష నేతలంతా కలుసుకుని లోక్‌సభ ఎన్నికలపై వ్యూహరచన చేయడంపై ప్రధాని మోదీ భయపడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో పత్తా లేకుండా పోతామని ఆందోళన చెందుతున్నారని ఆయన విమర్శించారు.