టీడీపీకి మరో షాక్? వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే?

ఇప్పుడాయన అయోధ్య రామిరెడ్డిని కలవడంతో వైసీపీలో చేరతారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

టీడీపీకి మరో షాక్? వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే?

Jaleel Khan

Updated On : February 21, 2024 / 11:56 PM IST

Jaleel Khan : విజయవాడ వెస్ట్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం నెలకొంది. వైసీపీ కీలక నేత అయోధ్య రామిరెడ్డిని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కలిశారు. కొంత కాలంగా టీడీపీలో విజయవాడ వెస్ట్ టికెట్ కోసం జలీల్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇప్పుడాయన అయోధ్య రామిరెడ్డిని కలవడంతో వైసీపీలో చేరతారు అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

జలీల్ ఖాన్.. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బలమైన మైనార్టీ నేతగా ఉన్నారు. ఆయన వైసీపీ కీలక నేత అయోధ్య రామిరెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జలీల్ ఖాన్ టీడీపీ నేతగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే. పొత్తుల్లో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు టీడీపీకి దక్కుతుందా? జనసేనకు కేటాయిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు. ఈ క్రమంలో జలీల్ ఖాన్ అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈసారి తనకే అవకాశం ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు అధిష్టానానికి విన్నవించారు జలీల్ ఖాన్. తనకు టికెట్ ఇవ్వకపోతే మైనార్టీలు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేసుకునేంత సున్నిత మనస్కులు అని జలీల్ ఖాన్ చెప్పారు. టికెట్ పొందేందుకు అన్ని విధాలుగా తాను అర్హుడిని అని టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర జలీల్ ఖాన్ విన్నవించారు.

కాగా, విజయవాడ వెస్ట్ టికెట్ టీడీపీకి దక్కుతుందా? జనసేనకు ఇస్తారా? అన్న దానిపై కొన్ని రోజుల్లోనే క్లారిటీ రానుంది. టీడీపీ, జనసేనలో ఇద్దరు బలమైన నేతలు విజయవాడ వెస్ట్ టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ కు టికెట్ దక్కే అవకాశం ఉందా? లేదా? అనే దానిపై సందిగ్ధత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జలీల్ ఖాన్ వైసీపీ కీలక నేతను కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముస్లింలలో బలమైన, కీలకమైన నేతగా ఉన్న తనకు వైసీపీ టికెట్ ఇస్తారనే ఆశతో జలీల్ ఖాన్.. అయోధ్య రామిరెడ్డిని కలిసినట్లు సమాచారం.

Also Read : సీఎం జగన్‌ వ్యూహం ఏంటి? ఎన్నికల్లో గెలుపు స్కెచ్‌ ఎలా ఉండబోతోంది