వంగవీటి రాధాకృష్ణతో టీడీపీ నేతలు భేటీ : పార్టీలోకి ఆహ్వానం
వైసీపీని వీడిన వంగవీటి రాధాను నేతలు టీడీపీలోకి ఆహ్వానించారు.

వైసీపీని వీడిన వంగవీటి రాధాను నేతలు టీడీపీలోకి ఆహ్వానించారు.
విజయవాడ : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్సీలు టీడీ జనార్ధన్, బచ్చుల అర్ణునుడు సమావేశం అయ్యారు. వైసీపీని వీడిన వంగవీటి రాధాను నేతలు టీడీపీలోకి ఆహ్వానించారు. పేదల సంక్షేమం కోసం రాధాకృష్ణ చేసిన సూచనలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాధా పార్టీలో చేరే అంశంపై రేపు మీడియా సమావేశంలో వెల్లడిస్తారని చెప్పారు.
వైసీపీలో జరిగిన అవమానాలను ప్రజల ముందుకు తెచ్చే యోచనలో రాధా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ పై రాధా తీవ్రస్థాయిలో విమర్శలు చేసే అవకాశం ఉంది. వంగవీటి రాధాకృష్ణ చేరికతో విజయవాడలో టీడీపీ మరింత బలపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. టీడీపీలో చేరక ముందే సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. ఈనెల 25న రాధా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.