టీడీపీ మేనిఫెస్టో విడుదలను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు రేపటికి వాయిదా వేశారు.
అమరావతి : టీడీపీ మేనిఫెస్టో విడుదలను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు రేపటికి వాయిదా వేశారు. వాస్తవానికి మేనిఫెస్టో నిన్న (మార్చి 20 బుధవారం) విడుదల చేయాల్సివుంది. కానీ నేటికి వాయిదా వేశారు. అయితే ఇవాళ కూడా మేనిఫెస్టో విడుదల చేయలేదు. మళ్లీ రేపటికి వాయిదా పడింది. అయితే మేనిఫెస్టోకు చంద్రబాబు తుది మెరుగులు దిద్దుతున్నారు. చిన్న చిన్న మార్పులు చేయనున్నారు. సంక్షేమ పథకాలపై మరింత కసరత్తు చేస్తున్నారు.
Read Also : కేసీఆర్ పాలన చూసే టీఆర్ఎస్‌లో చేరా : నామా
పేదలకు సంక్షేమ పథకాలు మరిన్ని పెంచాలని నిర్ణయించారు. సాయంత్రానికి పూర్తి స్థాయిలో మేనిఫెస్టో సిద్ధం చేయాలని మేనిఫెస్టో కమిటీని ఆదేశించారు. అమలు కానీ హామీల కన్నా అమలయ్యే హామీలు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు కచ్చితంగా అమలు చేయాలని నిశ్చయించుకున్నారు. అయితే మేనిఫెస్టోలో కొత్త కార్యక్రమాలు ఉండకపోవచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
Read Also : టీ టీడీపీ కి మరో షాక్: టీఆర్ఎస్ లో చేరనున్న మహిళా నేత