వంశీకో న్యాయం.. నాకో న్యాయమా..? చంద్రబాబుని నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యే

ఇటీవలే సీఎం జగన్ ను కలిసి టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన చంద్రబాబుకి ఘాటు

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 01:30 PM IST
వంశీకో న్యాయం.. నాకో న్యాయమా..? చంద్రబాబుని నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యే

Updated On : January 2, 2020 / 1:30 PM IST

ఇటీవలే సీఎం జగన్ ను కలిసి టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన చంద్రబాబుకి ఘాటు

ఇటీవలే సీఎం జగన్ ను కలిసి టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన చంద్రబాబుకి ఘాటు లేఖ రాశారు. వంశీకి ఓ న్యాయం, నాకు మరో న్యాయమా? అని లేఖలో చంద్రబాబుని నిలదీశారు. వివరాల్లోకి వెళితే.. మద్దాలి గిరిని గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇంచార్జి పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో కోవెలమూడి రవీంద్రకు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఈ లేఖ గిరికి తీవ్రమైన కోపం తెప్పించింది. కళా వెంకట్రావు నిర్ణయాన్ని తప్పుపడుతూ చంద్రబాబుకి ఘాటుగా బహిరంగ లేఖ రాశారు మద్దాలి గిరి.

ముఖ్యమంత్రి జగన్ ని కలిసిన 12 గంటల వ్యవధిలోనే తన నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జిని నియమించడాన్ని మద్దాలి గిరి తప్పుపట్టారు. వల్లభనేని వంశీ ప్రాతినిథ్యం వహిస్తున్న గన్నవరం స్థానానికి గానీ, మాజీ స్పీకర్ దివంగత కోడెల శివప్రసాద్ రావు నియోజకవర్గం సత్తెనపల్లిలో కానీ ఇంఛార్జిని ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. వారిద్దరూ చంద్రబాబు సామాజిక వర్గం కమ్మ కులానికి చెందిన నాయకులు కావడం వల్లే ఇంచార్జిలను నియమించలేదని మద్దాలి గిరి ఆరోపించారు. టీడీపీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారని ఎమ్మెల్యే మద్దాలి గిరి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో టికెట్ కేటాయింపులోనూ ఇదే వైఖరి అవలంభించారని, చివరి నిమిషం వరకూ తనను ఎన్నో సమస్యలకు గురి చేశారని వాపోయారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రి జగన్‌ ను కలిశానని, సీఎంను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. సీఎం కలిసినందుకు తన అనుమతి లేకుండా నియోజకవర్గానికి మరో ఇంచార్జ్‌ని నియమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గత నాలుగు రోజులుగా తనకు వ్యతిరేకంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయని మద్దాలి గిరి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా తాను ప్రజల వెంటే ఉన్నానని, తనను గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మార్గాలను, నియోజక వర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రితో చర్చించడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీషు మీడియం బోధన నిర్ణయాన్ని సమర్ధించడం తప్పా అని నిలదీశారు.

సీఎం జగన్ ను కలవడం వెనుక ఉన్న కారణాలను తెలుసుకోకుండా, కనీసం షోకాజు నోటీసులు ఇవ్వకుండా, నా వివరణ తీసుకోకుండా.. 12 గంటల వ్యవధిలోనే నియోజకర్గ ఇంచార్జ్ గా మరొకరిని నియమించడంలో మీ ఆంతర్యం ఏంటని చంద్రబాబుని ప్రశ్నించారు ఎమ్మెల్యే గిరి.

”జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే 9 సీట్లు ఒక సామాజిక వర్గానికే కేటాయించారు. ఎన్టీఆర్ స్తాపించిన పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉంటే ఇదేనా మీ ప్రవర్తన. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన నలుగురు విశాఖ ఎమ్మెల్యేలపై మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీ పార్టీలో నాయకులు బయటకు వెళితే వారి ఇళ్లపై దాడులు చేస్తారా.? ’అని లేఖలో ప్రశ్నించారు మద్దాలి గిరి. కాగా, మద్దాలి గిరి.. సీఎం జగన్ ను కలవడం టీడీపీలో దుమారం రేపింది. వంశీ బాటలో మద్దాలి గిరి వెళ్తున్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే టీడీపీ వీడీ వైసీపీలో చేరతారని తమ్ముళ్లు అనుకుంటున్నారు.

letter