నేను జైలుకెళ్లి చిప్పకూడు తినలేదు : నిమ్మల రామానాయుడు

తాను జైలుకెళ్లి చిప్పకూడు తినలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. చార్జీషీట్ లో ఏ1 ముద్దాయిగా లేనని, 16 నెలలు జైలులో ఉండలేదని తెలిపారు.

  • Publish Date - December 13, 2019 / 04:17 AM IST

తాను జైలుకెళ్లి చిప్పకూడు తినలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. చార్జీషీట్ లో ఏ1 ముద్దాయిగా లేనని, 16 నెలలు జైలులో ఉండలేదని తెలిపారు.

తాను జైలుకెళ్లి చిప్పకూడు తినలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. చార్జీషీట్ లో ఏ1 ముద్దాయిగా లేనని, 16 నెలలు జైలులో ఉండలేదని తెలిపారు. శుక్రవారం (డిసెంబర్ 13, 2019) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులను గేట్ దగ్గర అడ్డోగోలుగా అడ్డుకున్నారని అన్నారు. మార్షల్స్ టీడీపీ సభ్యుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. నిన్న తాము అసెంబ్లీకి వస్తున్నప్పుడు గేట్ దగ్గర మార్షల్స్ ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలను అడ్డగోలుగా అడ్డుకున్నారని తెలిపారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి చంద్రబాబును గేట్ బయట ఆపారని, చీఫ్ మార్షల్స్ చేతులతో ఎట్లా నలిపేస్తారని ప్రశ్నించారు. తమను గేటు దగ్గర 40 నిమిషాల పాటు అడ్డుకునే అవసరమేంటని ప్రశ్నించారు. పేర్నినాని ఆయనకు కావాల్సిన ఫొటోలను గ్రాఫిక్స్ చేసి, ఎడిట్ చేసి చూపిస్తున్నారని తెలిపారు.