మురళీ మోహన్ సంచలన నిర్ణయం : ఎంపీగా పోటీ చేయడం లేదని ప్రకటన
టీడీపీ రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీ మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎంపీగా పోటీ చేయడం లేదని తెలిపారు.

టీడీపీ రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీ మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎంపీగా పోటీ చేయడం లేదని తెలిపారు.
రాజమండ్రి : టీడీపీ రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీ మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎంపీగా పోటీ చేయడం లేదని తెలిపారు. మురళీమోహన్ చారీటబుల్ ట్రస్టును మళ్లీ దారిలోకి తేవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాజకీయాల్లోనే ఉంటానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును మళ్లీ సీఎంను చేయడానికి కృషి చేస్తానని అన్నారు.
పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు మురళీమోహన్. క్రితం సారి తాను పోటీ చేస్తే లక్షా 68 వేల మెజారిటీతో గెలుపొందానని.. ఈసారి పోటీ చేస్తే 2 లక్షల మెజారిటీతో గెలుస్తానని…అందులో ఏమాత్రం సందేహం లేదన్నారు. ఎవరికో భయపడి, ఓటమి పాలు అవుతానన్న భయంతో ఎంపీకి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
ఈసారి ఎంపీగా పోటీ చేయకపోవడానికి చాలా కారణాలున్నాయని తెలిపారు. జీవితంలో నెరవేర్చాల్సిన, చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయన్నారు. తాను 2006లో స్థాపించిన మురళీమోహన్ చారీటబుల్ ట్రస్టును రాజకీయాల్లో పడి నిర్లక్ష్యం చేసినట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన 10 సంవత్సరాల్లో చారీటబుల్ ట్రస్టు కుంటుపడిందని పేర్కొన్నారు. ట్రస్టును మళ్లీ దారిలోకి తేవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.