తెలంగాణ మంత్రివర్గం భేటీ స్టార్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ప్రగతి భవన్‌లో జరుగుతున్న ఈ మీటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది. గత 52 రోజుల పాటు జరిగిన ఆర్టీసీ సమ్మెపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యకు ఒక ముగింపు ఇస్తారన్న ప్రచారంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. విధుల్లోకి చేరేందుకు ముందుకు వస్తున్నా..ప్రభుత్వం వారిని అనుమతించడం లేదు.
దీంతో తమ భవిష్యత్ ఏంటని కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? విధుల్లో తీసుకోవడానికి అనుమతినిస్తారా ? సెప్టెంబర్ నెల వేతనాలు ఇవ్వడానికి ఒకే చెబుతారా ? ఇలాంటి ఎన్న ప్రశ్నలు వారి మదిని తొల్చేస్తున్నాయి. ఈ కేబినెట్ మీటింగ్ రెండు రోజుల పాటు కొనసాగనుందని తెలుస్తోంది. తొలి రోజు మాత్రం పూర్తిగా ఆర్టీసీ అంశంపైనే చర్చించనున్నట్లు సమాచారం.
> ఆర్టీసీ సమ్మె, ప్రైవేటు రూట్ల పర్మిట్లు, నూతన రెవెన్యూ చట్టంపై చర్చ.
> అక్టోబర్ 04వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు.
> విధుల్లోకి చేరాలని ప్రభుత్వం పలు గడువులను విధించినా..కార్మికులు బేఖాతర్ చేశారు.
> హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. ఈ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వానికి తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, విషయాన్ని లేబర్ కోర్టులో తేల్చుకోవాలని కోర్టు సూచించింది.
> చివరకు 52 రోజల పాటు జరిగిన సమ్మెను ఆర్టీసీ జేఏసీ విరమించింది. విధుల్లో తీసుకోవాలని జేఏసీ సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదు.
> కేబినెట్ సమావేశంలో ప్రైవేట్ రూట్లపై ప్రకటన, లేబర్ కోర్టుకు వెళ్లే అంశాలతో పాటు కార్మికులను విధుల్లోకి తీసుకునే షరతలుపై చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
> ఆర్టీసీలో 50 శాతం ప్రైవేట్ భాగస్వామ్యంతో బస్సులు నడపాలని నిర్ణయించారు.
> పూర్తి కసరత్తు చేసిన ప్రభుత్వం.. మొత్తం 5వేల 100 రూట్లను ప్రైవేట్ పరం చేయాలనుకుంటోంది.
> విధుల్లో చేరేందుకు కార్మికులు ముందుకు వచ్చినా.. ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దీంతో శాశ్వత పరిష్కారం పేరుతో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.
Read More : డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు : చంపింది వాళ్లేనా?