కరోనా వైరస్‌పై కీలక నిర్ణయం : మార్చి 31 వరకు హైదరాబాద్ షట్ డౌన్

  • Published By: madhu ,Published On : March 14, 2020 / 10:51 AM IST
కరోనా వైరస్‌పై కీలక నిర్ణయం : మార్చి 31 వరకు హైదరాబాద్ షట్ డౌన్

Updated On : March 14, 2020 / 10:51 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటోంది. 2020, మార్చి 14వ తేదీ శనివారం హైలెవల్ కమిటీ సమావేశం జరిగింది. వైరస్‌ను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాలపై సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో కూడా చర్చించనున్నారు. కేబినెట్ నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను స్వయంగా కేసీఆర్ మీడియాకు వివరించనున్నారు. పొరుగు దేశానికి చెందిన ఓ వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలో తిరిగి..చనిపోవడం చర్చనీయాంశమైంది. 

కరోనా వైరస్ రాష్ట్రంలో తీవ్రంగా ప్రబలకపోయినా…ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు కరోనా వైరస్ సోకిందని, వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒక రోగిని డిశ్చార్జ్ చేసిన సంగతి తెలిసిందే. మరో పేషెంట్ (ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తి)కి పాజిటవ్ తేలడం, మరో ఇద్దరికి లక్షణాలున్నాయని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను శాసనసభలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం విపత్కరమైన పరిస్థితుల్ల నడుమ ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలను కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే.

బర్త్ డే, వివాహ వేడుకలను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని, జనసమ్మర్థం ఎక్కువగా ఉంటే..వైరస్  ఎక్కువగా వ్యాపిస్తుందని భావిస్తూ..ఈ నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుందని, సహకరించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. (కరోనాపై కేంద్రం కీలక నిర్ణయం, మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం)