జనసేన బహిరంగ సభ రసాభాస : హైపర్ ఆది కారు అద్దాలు ధ్వంసం

చిత్తూరు : జిల్లాలో జనసేన బహిరంగ సభ రసాభాసయింది. సోమల మండలం కందూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభకు హైపర్ ఆది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలోకి దూసుకువచ్చిన వచ్చిన వైసీపీ కార్యకర్తలు…బీభత్సం సృష్టించారు. దీంతో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ గొడవలో హైపర్ ఆది కారు అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.