Lalu Prasad Yadav: ప్రధానిగా ఉండాలంటే భార్య ఉండాలని షరతు విధించిన లాలూ.. ఇంతకీ రాహుల్‭ను అన్నారా? మోదీని అన్నారా?

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు ఏకమవుతున్నాయి. అయితే విపక్ష కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీకి పెళ్లైనప్పటికీ.. కొద్ది రోజులకే వారు విడిపోయారు. చాలా కాలంగా ఆయన భార్యతో లేరు.

Prime Minister: దేశానికి ప్రధాని ఎవరైనా సరే, వాళ్లు కచ్చితంగా భార్యతో ఉండాలని షరతు పెట్టారు రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్. అయితే ఇది రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారా లేదంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి అన్నారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు ఏకమవుతున్నాయి. అయితే విపక్ష కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీకి పెళ్లైనప్పటికీ.. కొద్ది రోజులకే వారు విడిపోయారు. చాలా కాలంగా ఆయన భార్యతో లేరు.

NDA: 18న హోటల్‌లో ఎన్డీఏ కీలక సమావేశం… టీడీపీకి ఆహ్వానం.. ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ కీలక పరిణామం

రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం ప్ర‌తిప‌క్షాలు అన్నీ ఏకం అయిన విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌తిప‌క్షానికి ప్ర‌ధాని అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న దానిపై క్లారిటీ లేదు. ఈ నేప‌థ్యంలో మీడియా లాలూను ప్ర‌శ్నించింది. దానికి స్పందిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్రధానమంత్రి వైవాహిక జీవితంపై, రాహుల్ గాంధీ పెళ్లిపై అనేక ప్రశ్నలు తరుచూ వస్తూనే ఉంటాయి. పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశం అనంతరం రాహుల్‭ను పెళ్లి చేసుకొమ్మని లాలూ సూచించారు.

Khalistan Threats: కెనడా అడ్డాగా రెచ్చిపోతున్న ఖలిస్తానీ మద్దతుదారులు.. అయినా భారత్‭నే తప్పు పడుతున్న కెనడా ప్రధాని

బీజేపీకి విపక్షంగా ఉన్న నేపథ్యంలో లాలూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించినవేనని కొందరు అంటుండగా.. మరికొందరేమో పాట్నా సమావేశాన్ని ఉదహరిస్తూ రాహుల్ గాంధీని అన్నారని అంటున్నారు. ప్ర‌ధానిగా ఉండాలనుకునే వ్యక్తి ఎవ‌రైనా.. భార్య‌తోనే ప్ర‌ధాని కార్యాల‌యంలో ఉండాల‌ని లాలూ త‌న అభిప్రాయాన్ని బల్లగుద్ది చెప్పారు.