Women Reservation Bill: మహిళా రిజర్వేషన్‭ బిల్లుపై విపక్షాల డిమాండుకు ఉమాభారతి మద్దతు.. ఇరకాటంలో బీజేపీ

పాత పార్లమెంట్‌ భవనానికి బయటి నుంచి అతిథులు వస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ రోజు చాలా అదృష్టవంతమైన రోజు. కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ జరుగుతోంది. ఇది చాలా ముఖ్యమైంది. పాత పార్లమెంట్ భవనం పరిస్థితి మరీ దారుణంగా ఉంది

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్‭ బిల్లుపై విపక్షాల డిమాండుకు ఉమాభారతి మద్దతు.. ఇరకాటంలో బీజేపీ

Updated On : September 19, 2023 / 7:43 PM IST

Uma Bharti: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును మంగళవారం నూతన పార్లమెంట్‌ హౌస్‌లో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులో పలు మార్పులు చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఇదే డిమాండును అధికార పక్ష నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి సైతం లేవనెత్తారు. దీంతో అధికార భారతీయ జనతా పార్టీ ఇరకాటంలో పడే అవకాశం లేకపోలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ-ఎస్టీతో పాటు ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉమాభారతి అంటున్నారు. ఇదే డిమాండును బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యూనియన్, సమాజ్ వాదీ పార్టీలు లేవనెత్తాయి.

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం లాంఛనమే.. అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలుసా?

వాస్తవానికి అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినప్పటికీ ఈ పార్టీలు మాత్రం వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ విషయమై ఉమాభారతి మాట్లాడుతూ.. ‘‘మహిళా రిజర్వేషన్‌ ఇస్తున్నందుకు సంతోషిస్తున్నా.. ఓబీసీ రిజర్వేషన్‌ లేకుండానే వచ్చిందన్న భావన బలంగా ఉంది. ఎందుకంటే మనం OBC మహిళలను కలుపుకోకపోతే, మనల్ని విశ్వసించే సమాజ విశ్వాసం విచ్ఛిన్నమవుతుంది’’ అని అన్నారు.

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మార్చడంలో 27 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి? పూర్తి చరిత్ర తెలుసుకోండి.

దీంతో పాటు కొత్త పార్లమెంట్ భవనంపై కూడా ఉమాభారతి ప్రస్తావించారు. ‘‘పాత పార్లమెంట్‌ భవనానికి బయటి నుంచి అతిథులు వస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈ రోజు చాలా అదృష్టవంతమైన రోజు. కొత్త పార్లమెంట్ భవనంలో పార్లమెంట్ జరుగుతోంది. ఇది చాలా ముఖ్యమైంది. పాత పార్లమెంట్ భవనం పరిస్థితి మరీ దారుణంగా ఉంది’’ అని అన్నారు. ఇక సనాతన ధర్మ వివాదంపై కూడా ఆమె స్పందించారు. ‘‘అతను (ఉదయనిధి) సనాతన ధర్మానికి సంబంధించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. నేను ఇంతకుముందు కూడా అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెబుతాను. సనాతన్ విషయంలో ఈ వివాదాన్ని నేతలకు కాకుండా శంకరాచార్యులకే వదిలేయాలి’’ అని ఉమా భారతి అన్నారు.