వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా 

వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా చేశారు.

  • Publish Date - January 20, 2019 / 01:34 PM IST

వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా చేశారు.

విజయవాడ : ఏపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పలువురు నాయకులు పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా చేశారు. గతకొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై రాధా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే పార్టీకి గుడ్ బై చెప్పినట్లు సమాచారం. 

రంగా ఆశయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత తనపై ఉందని వంగవీటి రాధా అన్నారు. ఆంక్షలు లేని ప్రయాణంలో వెళ్లాలని తన ఆకాంక్ష అని తెలిపారు. సీఎం అవ్వాలనే ఆకాంక్ష నెరవేరాలంటే వైసీపీ ఆంక్షలు విధించడం జగన్ కు తప్పనిసరి పేర్కొన్నారు. తన ఆకాంక్ష నెరవేరాలంటే ఆంక్షలు లేని ప్రయాణం తనకు తప్పనిసరి అన్నారు. ఆంక్షలు ఉన్న పార్టీలో కొనసాగలేకే రాజీనామా చేస్తున్నానని రాధా ప్రకటించారు.