Rahul Disqualification: అనర్హత వేటు ఎందుకు పడుతుంది? రాహుల్ గాంధీ విషయంలో ఏం జరిగింది?

అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి.

Rahul Disqualification: మోదీ ఇంటి పేరు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వచ్చిన 24 గంటల్లోనే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్‭సభ సెక్రెటేరియట్ అనర్హత వేటు వేయడం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. అప్పీల్‭కు వెళ్లే అవకాశమున్నప్పటికీ సూరత్ కోర్టు ఆదేశాలను అవకాశంగా తీసుకుని కక్షపూరితంగా అనర్హత వేటు వేశారంటూ కాంగ్రెస్‭తో పాటు విపక్షాలు బీజేపీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. అయితే రాహుల్ మీద అనర్హత వేటుతో ఒక్కసారిగా అనర్హత వేటు గురించి దేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. రాహుల్ మీద అనర్హత వేటు ఎందుకు పడింది? ఆయన చేసిన తప్పేంటి? ఇంతకీ ఏయే సందర్భాల్లో ఒక ప్రజాప్రతినిధిని చట్ట సభలు అనర్హుడిగా ప్రకటిస్తాయి? అనర్హుడిగా ప్రకటించిన తర్వాత ఆ సభ్యులకు ఉండే అవకాశాలేంటి? ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Errabelli Dayakar Rao : రాహుల్ గాంధీకి పట్టిన గతే మీకూ పడుతుంది.. రేవంత్, బండి సంజయ్‌కి జైలుశిక్ష తప్పదు-మంత్రి ఎర్రబెల్లి

అనర్హత అనేది అరుదుగానైనా అప్పుడప్పుడు ఇలాంటివి రాజకీయ నేతలు ఎదుర్కొంటున్నారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ సైతం అనర్హత వేటు ఎదుర్కొన్నారు. శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఎవరైనా సరే సందర్భాన్ని బట్టి అనర్హత వేటు ఎదుర్కోక తప్పదు. అయితే మన దేశంలో మూడు సందర్భాల్లో ఈ అనర్హతను ఎదుర్కొంటారు. అందులో మొదటిది.. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ ప్రభుత్వం నుంచి వేరే మార్గాల ద్వారా ఆదాయం పొందినా, లేదంటే వాళ్ల మానసిక స్థితి సరిగా లేకపోయినా, సరైన పౌరసత్వం లేకపోయినా వాళ్లను ఆర్టికల్ 102(1) ప్రకారం అనర్హులుగా ప్రకటించవచ్చు. ఇదే అంశాలకు సంబంధించి శాసనసభ్యులనైతే ఆర్టికల్ 191(1) ప్రకారం అనర్హత వేటు వేస్తారు.

Rahul Gandhi: 2013లో ఏ చట్టాన్నైతే రాహుల్ చింపేశారో.. ఇప్పుడదే చట్టానికి బలయ్యారు

ఇక రెండో సందర్భం అనర్హత వేటు గురించి టెన్త్ షెడ్యూల్‭లో పొందు పరిచారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే టెన్త్ షెడ్యూల్ ప్రకారం అనర్హత విధించే అవకాశముంటుంది. అయితే రాహుల్ గాంధీ ఈ రెండు కాకుండా మూడో అంశం కింద అనర్హత వేటు ఎదుర్కొన్నారు. నేరపూరిత రాజకీయాలకు పాల్పడే వారిపై ఈ అనర్హత వేటు వేస్తారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం.. ప్రజాప్రతినిధులు నేరాలకు పాల్పడితే ఈ చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం అనర్హులుగా ప్రకటించవచ్చు. అలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8ని చేర్చారు. కాగా ఈ సెక్షన్-8లో అత్యంత కీలకమైంది సబ్ సెక్షన్ 3.

Rahul Disqualification: పాతాళానికి దిగజారిన బీజేపీ.. రాహుల్ గాంధీ మీద అనర్హత వేటుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం

రిప్రజంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 సెక్షన్ 8(3)ప్రకారం ఎవరైనా పార్లమెంట్ సభ్యుడిని కోర్టు దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తే ఆ సభ్యుడి పార్లమెంట్ సభ్యత్వం దానంతటదే రద్దవుతుంది. రాహుల్ గాంధీ విషయంలో జరిగింది ఇదే. సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించగానే లోక్‭సభ సెక్రటేరియట్ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే 2018 నాటి లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. శిక్ష పడిన ప్రజాప్రతినిధికి అప్పీల్ చేసుకునే అవకాశముంటుంది. అప్పటి వరకు తీర్పుపై స్టే అమల్లో ఉంటుంది. దీని ప్రకారం రాహుల్ గాంధీ ముందుగా సూరత్ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అక్కడ తీర్పు అనుకూలంగా రాకపోతే గుజరాత్ హైకోర్టుకు వెళ్లొచ్చు. ఆ పై సుప్రీంకోర్టు గడప కూడా తొక్కొచ్చు.

Chetan Kumar: హిందుత్వం మీద వ్యాఖ్యలతో అరెస్టైన కన్నడ యాక్టర్‭కు బెయిల్

వాస్తవానికి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4) ప్రకారం తీర్పు వచ్చిన మూడు నెలల తర్వాత అనర్హత అమల్లోకి రావాలి. ఈ మూడు నెలల సమయంలో ఎప్పుడైనా ఆయా ప్రజాప్రతినిధులు హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశముంటుంది. అయితే ఈ సెక్షన్‭ రాజ్యాంగ విరుద్ధమని 2013లో సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో రెండేళ్ల శిక్ష పడిన ప్రజా ప్రతినిధుల సభ్యత్వం ఆటోమెటిక్‭గా రద్దయ్యే విధానం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతమున్న తీర్పు ప్రకారం రాహుల్ గాంధీ ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోయారు.

Rajampet Lok Sabha Constituency : రసవత్తరంగా రాజంపేట పార్లమెంట్‌ రాజకీయం… ట్రయాంగిల్‌ ఫైట్‌ తప్పదా ?

అయితే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి సూరత్ సెషన్స్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను పై కోర్టులు తగ్గించాలి. లేదంటే ఆ తీర్పును పూర్తిగా రద్దు చేయాలి. ఈ రెండింటిలో ఏది జరిగినా అనర్హత వేటు నుంచి రాహుల్ తప్పించుకోగలరు. ఒకవేళ అలా జరక్కపోతే రానున్న 8ఏళ్ల పాటు పార్లమెంట్‭లో అడుగు పెట్టలేరు. సెషన్స్ కోర్టు, హైకోర్టు కాకుండా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా రాహుల్ గాంధీకి ఆర్టికల్ 136 కల్పిస్తుంది. దేశంలోని అన్ని కోర్టులు, ట్రైబ్యునల్స్ ఇచ్చిన తీర్పును రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది.

ట్రెండింగ్ వార్తలు