Rahul Disqualification: పాతాళానికి దిగజారిన బీజేపీ.. రాహుల్ గాంధీ మీద అనర్హత వేటుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం

దొంగలు, దోపిడీదారులు బాగానే ఉన్నారు. కానీ వారిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంపై ఇది ప్రత్యక్షంగా జరిగిన హత్య. అన్ని ప్రభుత్వ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. నియంతృత్వం అంతం అవ్వడానికి ఇదొక ప్రారంభం

Rahul Disqualification: పాతాళానికి దిగజారిన బీజేపీ.. రాహుల్ గాంధీ మీద అనర్హత వేటుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం

Opposition Reacts To Rahul Gandhi's Disqualification

Rahul Disqualification: కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేయడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. భారతీయ జనతా పార్టీ పాతాళానికి దిగజారి రాజకీయాలు చేస్తోందని, స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఇంత దిగజారడం చూడలేదని విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీకి ప్రజల కష్టాలు తీర్చడం చాతకాదు కానీ, విపక్షాలను మాత్రం ఇబ్బందులకు గురి చేయడం బాగా తెలుసని మండిపడుతున్నాయి. విపక్ష నేతలంతా ఒక్కసారిగా రాహుల్ గాంధీకి మద్దతుగా నోరు తెరిచారు. బీజేపీ మీద విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

Farooq Abdullah : రాముడు అందరికీ దేవుడే.. బీజేపీ మాత్రం రాజకీయం కోసమే రాముడ్ని వాడుకుంటోంది: ఫరూఖ్ అబ్దుల్లా

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఈ విషయమై స్పందిస్తూ ‘‘ప్రధాని మోదీ కొత్త భారత దేశంలో బీజేపీ ప్రధాన లక్ష్యం ప్రతిపక్ష పార్టీలే అయ్యాయి. తీవ్ర నేరాలు చేసిన బీజేపీ నేతలేమో కేబినెట్‭లో మంత్రులుగా రాజభోగాలు అనుభవిస్తున్నారు. అదే చిన్న ఆరోపణ వస్తే విపక్ష నేతలు అనర్హతకు గురి కావాల్సి వస్తోంది. ప్రజాస్వామ్యంలో అత్యంత పతనావస్థను మనం ఈరోజు చూడవచ్చు’’ అని ట్వీట్ చేశారు.

Rahul Gandhi: మోదీపై వ్యాఖ్యలకు భారీ మూల్యం చెల్లించుకున్న రాహుల్ గాంధీ.. పార్లమెంట్ నుంచి 8 ఏళ్లు ఔట్

‘‘దొంగలు, దోపిడీదారులు బాగానే ఉన్నారు. కానీ వారిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యంపై ఇది ప్రత్యక్షంగా జరిగిన హత్య. అన్ని ప్రభుత్వ సంస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. నియంతృత్వం అంతం అవ్వడానికి ఇదొక ప్రారంభం’’ అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అన్నారు. ‘‘భారత్ జోడో యాత్ర నుంచే బీజేపీ నేతల్లో వణుకు ప్రారంభమైంది. రాహుల్ గాంధీకి వస్తున్న జనాదరణ చూసి వారు తట్టుకోలేకపోయారు. అందుకే ఆయనను ఎలాగైనా ఆపాలని ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. రాహుల్ తండ్రి, నాయనమ్మ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ప్రజలు అది మర్చిపోరు’’ అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.

Rahul Gandhi: 2013లో ఏ చట్టాన్నైతే రాహుల్ చింపేశారో.. ఇప్పుడదే చట్టానికి బలయ్యారు

‘‘కుట్రలో భాగంగానే ఇది జరిగింది. బీజేపీ ఏం చేస్తుందో బీజేపీతో పాటు దేశం మొత్తం గమనిస్తూనే ఉంది. బీజేపీ ఆదేశాలతోనే దేశంలోని వ్యవస్థలు పని చేస్తున్నాయని వేరే చెప్పనక్కర్లేదు’’ అని బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. ‘‘పార్లమెంట్ కుర్చీలో నుంచి రాహుల్ గాంధీని తొలగించగలరేమో. కానీ, కోట్లాది ప్రజల మనసుల్లో నుంచి తీసేయలేరు. బీజేపీ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు.