సంగారెడ్డి: కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేచే జగ్గారెడ్డి వెనక్కితగ్గారా? ఎప్పుడూ నిప్పులు చెరిగే ఆయన… మెతకవైఖరి అవలంభిస్తున్నారా? ఆయన స్వరం ఎందుకు మారింది?
సంగారెడ్డి: కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేచే జగ్గారెడ్డి వెనక్కితగ్గారా? ఎప్పుడూ నిప్పులు చెరిగే ఆయన… మెతకవైఖరి అవలంభిస్తున్నారా? ఆయన స్వరం ఎందుకు మారింది? సాఫ్ట్‌గా మాట్లాడటం వెనక మర్మమేంటి? ఇదే ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్. జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి.. హాట్‌హాట్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే కాంగ్రెస్ లీడర్. కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్న నాయకుడు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా కుండబద్ధలు కొట్టినట్లు చెబుతారనే పేరున్న నేత. ఇంతటి స్పీడున్న ఆయన… ఇటీవల కాస్త వెనక్కి తగ్గారనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఆయన వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు కనిపిస్తోంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగినా.. సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు జగ్గారెడ్డి. కానీ.. ఎన్నికల తర్వాత ఆయన స్వరం పూర్తిగా మారిపోయింది. టీఆర్ఎస్‌తో ఫైటింగ్ మోడ్ నుంచి తప్పుకున్నారు. గులాబీ బాస్‌పై ఎప్పుడూ గుస్సా చూపించే ఆయన.. ప్రస్తుతం కేసీఆర్ ఫ్యామిలీపై ప్రేమ కురిపిస్తున్నారు. ఎన్నో సవాళ్ల మధ్య ఎమ్మెల్యేగా ఎన్నికైన తనను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్న జగ్గారెడ్డి… తాను జైలుపాలైన సమయంలోనూ పార్టీపరంగా సరైన మద్దతు లభించలేదని భావిస్తున్నారట. అందుకే… ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌తో కయ్యం పెట్టుకుంటే సాధించేదేమీ ఉండకపోగా….లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని భావించి దూకుడు తగ్గించారన్న వాదన వినిపిస్తోంది.
కేసీఆర్ తనను ఎమ్మెల్యేను చేశారనడంతోపాటు… కేటీఆర్ నమ్మదగిన వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు జగ్గారెడ్డి. అంతేకాదు.. హరీష్‌రావుపై మాత్రం విమర్శలు గుప్పించారు. దీంతో.. కేసీఆర్‌కు జగ్గారెడ్డి దగ్గరవుతున్నారన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. కేసీఆర్‌కు పాజిటివ్ సిగ్నల్ పంపేందుకే హరీష్‌రావుపై విమర్శలు చేశారని పొలిటికల్ సర్కిల్స్ టాక్. ఇక గులాబీ బాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జగ్గన్న కారెక్కడం ఖాయమన్న చర్చ సాగుతోంది. మొత్తంగా తన వ్యాఖ్యలతో జగ్గారెడ్డి గులాబీ గూటికి దగ్గరవుతుంటే… కాంగ్రెస్‌లో మాత్రం కలవరం సృష్టిస్తున్నాయి. మరి జగ్గారెడ్డి సిగ్నల్స్ కారెక్కెందుకా..? లేదంటే… కాంగ్రెస్‌లోనే కామ్‌గా ఉండేందుకా అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.