Congress presidential election 2022: రేపు కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్.. గెలిస్తే గాంధీ కుటుంబం నుంచి సలహాలు తీసుకునేందుకు సిగ్గుపడనన్న ఖర్గే

ఖర్గే ఎన్నికయ్యాక ఆయన గాంధీ కుటుంబానికి రిమోట్ కంట్రోల్ గా పనిచేస్తారని విమర్శలు వస్తున్నాయి. తాజాగా, మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ... ‘‘మాట్లాడడానికి ఇతర విషయాలు ఏమీ లేకపోయినప్పుడు బీజేపీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. కాంగ్రెస్ కోసం సోనియా గాంధీ 20 ఏళ్లు పనిచేశారు. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ బలపడడానికి వారు ఎంతగానో కృషి చేశారు. వారు దేశానికి ఎంతో మంచి చేశారు. వారి సలహాలు తీసుకుంటే పార్టీకి లాభం. కాబట్టి వారి నుంచి నేను తప్పకుండా సలహాలు తీసుకుంటారు. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు’’ అని మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పోటీలో శశి థరూర్, మల్లికార్జున ఖర్గే నిలిచారు. రేపు పోలింగ్ జరగనుంది.

Congress presidential election 2022: రేపు కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్.. గెలిస్తే గాంధీ కుటుంబం నుంచి సలహాలు తీసుకునేందుకు సిగ్గుపడనన్న ఖర్గే

Mallikarjun Kharge

Updated On : October 16, 2022 / 4:44 PM IST

Congress presidential election 2022: కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే గాంధీ కుటుంబం నుంచి సలహాలు తీసుకునేందుకు సిగ్గుపడనని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పోటీలో ఉన్న ఖర్గేకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మద్దతు ఉందని, దీంతో ఆయనే గెలుస్తారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఖర్గే ఎన్నికయ్యాక ఆయన గాంధీ కుటుంబానికి రిమోట్ కంట్రోల్ గా పనిచేస్తారని విమర్శలు వస్తున్నాయి.

తాజాగా, మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ… ‘‘మాట్లాడడానికి ఇతర విషయాలు ఏమీ లేకపోయినప్పుడు బీజేపీ నేతలు ఇటువంటి వ్యాఖ్యలే చేస్తుంటారు. కాంగ్రెస్ కోసం సోనియా గాంధీ 20 ఏళ్లు పనిచేశారు. రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ బలపడడానికి వారు ఎంతగానో కృషి చేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది.

కొన్ని ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదు. వారు దేశానికి ఎంతో మంచి చేశారు. వారి సలహాలు తీసుకుంటే పార్టీకి లాభం. కాబట్టి వారి నుంచి నేను తప్పకుండా సలహాలు తీసుకుంటారు. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు’’ అని మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక పోటీలో శశి థరూర్, మల్లికార్జున ఖర్గే నిలిచారు. రేపు పోలింగ్ జరగనుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..