20 రోజుల తర్వాత : వచ్చేది ప్రజల ప్రభుత్వమే

నెల్లూరు: వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో జగన్ ఎన్నికల ప్రచారం చేశారు. 20 రోజుల తర్వాత ప్రజల ప్రభుత్వం వస్తుందని జగన్

  • Publish Date - March 20, 2019 / 09:01 AM IST

నెల్లూరు: వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో జగన్ ఎన్నికల ప్రచారం చేశారు. 20 రోజుల తర్వాత ప్రజల ప్రభుత్వం వస్తుందని జగన్

నెల్లూరు: వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో జగన్ ఎన్నికల ప్రచారం చేశారు. 20 రోజుల తర్వాత ప్రజల ప్రభుత్వం వస్తుందని జగన్ చెప్పారు. 20 రోజులు ఓపిక పడదాం.. అన్నని సీఎం చేసుకుందామని జగన్ పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు రోజుకో అబద్దం చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అనే భయంతో టీడీపీ వెబ్ సైట్ నుంచి ఎన్నికల మేనిఫెస్టోని తొలగించారని జగన్ అన్నారు.
Read Also : నరసాపురం టూ భీమవరం : అన్నయ్య పార్లమెంట్.. అసెంబ్లీకి తమ్ముడు.. రీజన్ ఇదే

చంద్రబాబు ఈ ఐదేళ్లలో మంచి పరిపాలన చేస్తే… ఎల్లో మీడియాలో ఆయన పరిపాలన మీద చర్చ జరపకుండా నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారని జగన్ ప్రశ్నించారు. మంచి పనులు చెయ్యలేక.. చంద్రబాబు రోజుకో అబద్దం చెబుతున్నారని జగన్ అన్నారు. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం అని చంద్రబాబు అన్నారని.. కనీసం రైతుల వడ్డీనైనా మాఫీ చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతలో పశువులను కొన్నట్టు వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారని మండిపడ్డారు. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారని.. ఓటుకు రూ.3వేలు ఇచ్చేందుకు వస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ హెచ్చరించారు. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోకండి అని చెప్పారు.
Read Also :  కాంగ్రెస్ కు మరో షాక్ : కారెక్కుతున్న కొల్హాపూర్ ఎమ్మెల్యే

ట్రెండింగ్ వార్తలు