దహనాలు, హత్యలకు చంద్రబాబు ఆదేశం : జగన్ తీవ్ర ఆరోపణలు

కడప: వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దహనాలు, హత్యలకు రెడీ కావాలని తన మనుషులకు, అనుచర గణానికి సీఎం

  • Published By: veegamteam ,Published On : March 22, 2019 / 09:49 AM IST
దహనాలు, హత్యలకు చంద్రబాబు ఆదేశం : జగన్ తీవ్ర ఆరోపణలు

Updated On : March 22, 2019 / 9:49 AM IST

కడప: వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దహనాలు, హత్యలకు రెడీ కావాలని తన మనుషులకు, అనుచర గణానికి సీఎం

కడప: వైసీపీ అధినేత జగన్.. సీఎం చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. 3 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దహనాలు, హత్యలకు రెడీ కావాలని తన మనుషులకు, అనుచర గణానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని జగన్ ఆరోపించారు. దహనాలు, హత్యలు మీరు చేయండి.. నేరాన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నెట్టండి అని చంద్రబాబు తన మనుషులతో చెప్పారని జగన్ అన్నారు. గురువారం(మార్చి 21, 2019) సీఎం చంద్రబాబు ఈ ఆదేశాలు ఇచ్చారని జగన్ తెలిపారు. ఎన్నికల్లో గెలవలేమన్న భయంతో.. చంద్రబాబు.. దారుణ మారణకాండకు తెరలేపారని జగన్ ఆరోపించారు.
Read Also : డీకే అరుణ బాటలో మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి?

తన సొంత నియోజకవర్గం కడప జిల్లా పులివెందులలో రోడ్ షో లో చంద్రబాబు విధానాలపై జగన్ విరుచుకుపడ్డారు. వాళ్ల పాలన మీద వాళ్లకి ఓట్లు అడిగే సత్తా లేదని జగన్ విమర్శించారు. అబద్దాలు, మోసాలతో చంద్రబాబు పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని.. వారి దృష్టిని మరల్చేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై ఎన్నికలు జరక్కుండా.. కడపలో హత్యా రాజకీయాలపై ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పడానికి చంద్రబాబు కుట్రలు పన్నారని అన్నారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు బాధాకరం అని జగన్ వాపోయారు.
Read Also : సొంతమామనే కుట్రచేసి చంపిన వ్యక్తి చంద్రబాబు : జగన్